ఎన్నికల్లో బాబుకు బుద్ది చెబుదాం : జక్కంపూడి

0
457
రాజమహేంద్రవరం, ఆగస్టు 7 :  వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబు 2014 ఎన్నికలో ఇచ్చిన హామీల్లో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ తి, తదితర అంశాల పై ఈరోజు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, రంపచోడవరం కోఆర్డినేటర్‌ అనంత ఉదయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా చంద్రబాబుకి యువత ఇప్పుడు గుర్తుకు వచ్చారని, 2019 ఎన్నికల్లో ఓటుతో ఆయనకు బుద్ది చెబుతారని రాజా అన్నారు.  2014 ఎన్నికలో చంద్రబాబు చెప్పినట్టు ఒక ఉద్యొగం కూడా ఇవ్వలేదని, కొడుకు లోకేషబాబుకు మాత్రం మంత్రి పదవి ఇచ్చారని రాజా విమర్శించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్‌ యువజన అధ్యక్షులు కసిరెడ్డి అంజిబాబు, మిందగుడిటి మోహన్‌, నీలి ఆనంద్‌, పోలు కిరణ్‌ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here