ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ఇక  వైఎస్సార్‌  ఆరోగ్యశ్రీ

0
188
అమరావతి, జూన్‌ 3 : ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజా సంక్షేమ పథకాల పేర్లు కూడా మారడం రివాజుగా వస్తుండగా రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ దిశగా మార్పులు ఆరంభమయ్యాయి. అందులో భాగంగా ఎన్‌టిఆర్‌ వైద్య సేవ పేరును వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా  మార్చాలని జగన్మోహనరెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. శాఖల వారీగా సమీక్షకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  ఈరోజు  వైౖద్య, ఆరోగ్య శాఖపై  సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేశ్‌, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వైద్యరంగంలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులతో  జగన్‌ చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులపై ప్రధానంగా చర్చ కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here