ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి క్రెడాయ్‌ ప్రతినిధుల అభినందనలు  

0
209
రాజమహేంద్రవరం, జూన్‌ 10 :  రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులుగా గెలుపొందిన ఆదిరెడ్డి భవానీని ఈరోజు క్రెడాయ్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు. క్రెడాయ్‌ ప్రతినిధులు బుడ్డిగ శ్రీనివాస్‌, సూరవరపు శ్రీను,మన్నే సుబ్బారావు, రెడ్డి రామకృష్ణ తదితరులు ఆదిరెడ్డి దంపతులను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. క్రెడాయ్‌కు పూర్తి సహాయసహకారాలు అందించాలని కోరారు. ప్రజాసేవలో మరింత రాణించాలని రాజకీయ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) కూడా అక్కడ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here