ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్‌ స్లిప్పులు ప్రభుత్వం పంపిణీ చేయాలి 

0
178
పట్టభద్రుల నియాజకవర్గ అభ్యర్థి టికె విశ్వేశ్వరరెడ్డి
రాజమహేంద్రవరం, మార్చి 8 : ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గానికి జరగబోయే ఎన్నికలో ఓటర్లకు స్లిప్పులను ప్రభుత్వం పంపిణీ చేయాలని అభ్యర్థి టికె విశ్వేశ్వర రెడ్డి కోరారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పదేపదే ప్రచారం చేస్తున్నారని అయితే పట్టభద్రుల నియోజకవర్గంలో ఎవరి ఓటు ఎక్కడుందో తెలియని అయోమయం నెలకొందన్నారు. అపార్ట్‌ మెంట్స్‌ లో డోర్‌ నెంబర్స్‌ ఉండవని అయితే లిస్టులో డోర్‌ నెంబర్స్‌ ఉన్నాయని,అలాగే భార్య ఓటు ఒకచోట , భర్త ఓటు మరోచోట ఉన్నాయని, ఓటర్‌ లిస్ట్‌ చాలా గందర గోళంగా ఉందని ఆయన విచారం వ్యక్తంచేసారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈమేరకు రాష్ట్ర   ఎన్నికల ప్రధానాధికారి  గోపాలక ష్ణ  ద్వివేదీకి ఇమెయిల్‌ ద్వారా వినతిపత్రం పంపినట్లు ఆయన చెప్పారు. పతివాడ రమేష్‌ బాబు, వీర్రాజు,జి తులసి,మార్టిన్‌ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here