ఎలకలు పడ్డాయి – ఇల్లు తగలెట్టు

0
128
మనస్సాక్షి  – 1152
‘ప్రతీ కుక్కకీ  ఓ  రోజొస్తుంది.. అని యింగ్లోషా డెప్పుడో చెప్పాడు. ఆ మాటేమో గానీ వెంకటేశానికి  కూడా అలాంటి రోజొకటి వచ్చినట్టే ఉంది. అసలయితే వెంక టేశానికి చిన్న బాధ లాంటిది ఉండి పోయింది. యింకా చెప్పాలంటే అది బాధ కూడా కాదు. ప్రగ, ప్రతీకారం లాంటిది..! అదీ యిప్పటిది కాదు. దాదాపు పదేళ్ళ నుంచీ అలాగే ఉండి పోయింది. యిప్పుడది తీరే రొజొచ్చే సింది. అసలు నాగయ్యలాంటి వెంక టేశంలో ఈ నాగభూషణంలాంటి ఛాయ లేంటో చూడాలంటే పదేళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే.. అప్పట్లో వెంకటేశం గంగలకుర్రులో టెన్త్‌ క్లాసు జోరుగా వెలగ బెడుతున్న రోజులు. అసలే తెలివయినోడు కావడంతో మార్కులవీ బాగానే వచ్చేవి. అంతేకాదు. ఫైనల్లో స్కూలు ఫస్టు కూడా వెంకటేశానికే వచ్చేసింది. బాగానే చదివే సుబ్బారావుకి సెకండ్‌ ర్యాంకొచ్చింది. వెంక టేశం అంత తెలివయినోడు కాకపోయినా సుబ్బారావు బాగా కష్టపడి చదువుతాడు. తర్వాత యిద్దరూ యిం టర్‌లో చేరారు. అయితే అసలు సమస్యంతా అక్క డ్నుంచే మొదలయింది. వెంకటేశాన్ని  డాక్టరీ చదివిం చాలని వెంకటేశం బామ్మగారి కోరిక.  దాంతో డాక్ట రయిపోవాలని వెంకటేశం మీద ఒత్తిడి బాగా ఎక్కు వయింది. యింకోపక్క సుబ్బారావింట్లో కూడా అదే పరిస్థితి. అయితే యిక్కడే సుబ్బారావు తండ్రి ఓ తెలి వైన పనిచేశాడు. యింటర్‌ చదవుతున్న ప్పుడే సుబ్బా రావుని ఎంసెట్‌ కోచింగ్‌కి పంపించాడు. దాంతో మోడల్‌ పేపర్స్‌ అన్నీ తెగ ప్రాక్టీస్‌ చేసేశాడు. అదేదో ఎంసెట్‌ పరీక్షలో పనికొచ్చింది. యింకోపక్క ఎంత తెలి వయినవాడైనా సరయిన ప్రాక్టీసు లేకపోవడంతో వెంకటేశానికి సీటు రాలేదు. మొత్తానికి సుబ్బారావు మంచి ర్యాంక్‌తో సీటు సంపాదించేసు కున్నాడు. యిదేదో  వెంకటేశానికి  తల తీసేసినట్టయింది. తనకి రాకుండా సుబ్బా రావుకి సీటు రావడం బొత్తిగా మింగుడు పడడం లేదు. అదీగాక యింట్లో వాళ్ళు ‘ఏరా వెంకన్నా.. ఆ సుబ్బారావుని చూడు.. చక్కా డాక్టరీ సీటు సంపాయిం చేశాడులాంటివి అంటున్నారాయె. అదేదో వెంకటేశానికి యింకా బాధయి పోయింది. తర్వాత్తర్వాత సుబ్బారావు ఎంబీబియస్‌ చేయడం,  ఆనక పీహెచ్‌ సిలో చేరడం జరిగింది. యింకోపక్క వెంకటేశం బీయస్సీ చదివి, ఎంబీయే చదివి, ఆనక రాజకీయాల్లో దున్నేద్దా మని గిరీశం గారి దగ్గర చేరాడు. అయితే ఆ రాజ కీయాలేవీ బొత్తిగా కలిసిరాకపోవడంతో వాటిని అట కెక్కించేసి తిరిగి కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ రాసే పనిలో పడ్డాడు. అసలే తెలివయినోడు. దాంతో రెండేళ్ళు తిరక్కుం డానే సివిల్స్‌ కొట్టడం, దాంతో ఐటిడిఏలో ప్రాజెక్ట్‌ ఆఫీసరు గానూ, తర్వాత  సబ్‌ కలెక్టర్‌ గానూ, చివరికి పక్క జిల్లాలో కలెక్టర్‌గానూ పోస్టింగ్‌ రావడం జరిగింది.
యయయ
వెంకటేశం వచ్చి కారెక్కాడు. పక్కనే పియ్యే సుందరం వచ్చి కూర్చు న్నాడు. కారు బయలుదేరింది. అసలే కలెక్టర్‌ గారి కారు కావడంతో వెనకాలే బంట్రోతుల్లాంటి పరివారం కూడా అనుసరించింది. యింతలో వెంకటేశం ”పొద్దుట్నించీ మీటింగ్‌లతో తలనొప్పిగా ఉంది. బిళ్ళలేవ యినా తీసుకుందాం” అన్నాడు. సుందరం తలూపి ”అలాగే సార్‌.. ఏదయినా మెడికల్‌ షాప్‌ దగ్గర పేరా సిట్మాల్‌ టేబ్లెట్‌ తీసుకుందాం” అన్నాడు. అయితే అప్పుడో విశేషం జరిగింది. అప్పటికి కలెక్టర్‌గారి కారు ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ముందు నుంచి పోతోంది.  అదేదో వెంకటేశం చూశాడు. దాంతో కారాపించాడు. గబగబా కారు దిగే శాడు. అలా దిగుతూ ”యిప్పుడు మనం వెళ్ళేది టేబ్లెట్స్‌ కోసం కాదు. ఆకస్మిక తనిఖీకి” అన్నాడు. అలా అనేసి కారు దిగేసి లోపలికి నడిచాడు. సుందరం కూడా అనుసరించాడు. ఈలోగా బంట్రోతు లోపలకెళ్ళి ”కలెక్టర్‌ గారొస్తున్నారు” అంటూ హడావిడి చేశాడు. దాంతో అక్కడ వాళ్ళంతా అలర్టయిపోయారు. ఈలోగా వెంకటేశం లోపలకొచ్చేసి ”ఎక్కడ?.. మీ డాక్టర్‌ గారెక్కడ?” అన్నాడు. దాంతో వారిలో సీనియర్‌ సిస్టర్‌ ”యిప్పుడే ఆయన యింటికెళ్ళారండీ.. రాత్రి రెండు  డెలి వరీ కేసులు, ఓ పాము కాటు కేసూ వస్తే రాత్రంతా యిక్కడే ఉండిపోయి అవన్నీ చూశారండీ. ఫ్రెషప్‌ అయివస్తా నని యిప్పుడే వెళ్ళారు” అంది.  అయితే వెంకటేశం ఆ వివ రణని పెద్దగా పట్టించుకోకుండా అక్కడే ఉన్న డాక్టర్‌ గారి టేబుల్‌ ముందున్న కుర్చీలో  కూర్చుని టేబుల్‌ మీదున్న మందులవీ  పరిశీలించడం మొదలెట్టాడు. అలా పరి శీలిస్తూనే ”యింతకీ మీ డాక్టర్‌ గారి పేరేంటి?” అనడిగాడు. దానికి సిస్టర్‌ ”డాక్టర్‌ సుబ్బారావు గారు” అంది. వెంక టేశం ఆసక్తిగా ”సుబ్బారావా.. యింటి పేరేంటీ?” అని అడిగేలోపు ఆదరాబాదరగా డాక్టర్‌ సుబ్బా రావు పరిగెత్తు కొచ్చాడు. ఒక్కసారిగా వెంక టేశం  మొహంలో విస్మ యం తొంగి చూసింది. ఈ సుబ్బారావు తన క్లాస్‌మేట్‌ సుబ్బారావే..! ఒక్కసారిగా వెంకటేశంలో తన పదేళ్ళ నాటి పగ లాంటిది గుర్తుకొచ్చింది. కలెక్టర్‌ హోదాలో ఉన్న వెంకటేశాన్ని చూడ గానే  సుబ్బారావులో విస్మయం తొంగి చూసింది. యింతలోనే  వెంక టేశం ”యిప్పుడు టైం 9:14 అయింది. యిప్పుడా పిహెచ్‌సికి రావడం? అదీ నేనొచ్చానని తెలిసి..” అన్నాడు గట్టిగా. దాంతో సుబ్బా రావు ”అది కాదురా..” అనబోయి, అంతలోనే ”అది కాద్సార్‌.. రాత్రంతా యిక్కడే డ్యూటీలో ఉండి, యిప్పుడే వెళ్ళా” అన్నాడు. అయినా వెంకటేశం అదేం పట్టించు కోకుండా ”నాకింకేం చెప్పొద్దు. అయినా ఈ పిహెచ్‌సిలో ముగ్గురు  డాక్టర్లుండాలిగా” అన్నాడు. దానికి సుబ్బా రావు ”అవు న్సార్‌.. యింకో యిద్దర్ని గవర్నమెంటు యింకా అపా యింట్‌ చేయాలి. అందుకే మొత్తం వర్కంతా నేనే చేస్తున్నా” అన్నాడు. వెంక టేశం  అదేం పట్టించుకోనట్టుగా ”యింకోసారి యిలా ఆలస్యం అవ డానికి వీల్లేదు. అదే జరిగితే మొత్తం అందరి మీదా యాక్షన్‌ తీసు కోవలసుంటుంది” అంటూ గట్టిగా అరిచేసి వెళ్ళి కారెక్కేశాడు.
యయయ
”అది గురూగారూ.. రాత్రి నాకొచ్చిన కల. అయినా నాలో అలాంటి షేడ్స్‌ ఉండడం ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు వెంకటేశం. ఈలోగా గిరీశం ఈ చుట్ట అంటించుకుని ”మన గంగలకుర్రు వెంక టేశంలో అయితే అలాంటి షేడ్స్‌ ఉండడం ఆశ్చర్యమే. అయితే కలెక్టర్‌ వెంక టేశంలో ఉండడం ఆశ్చర్యం కాదు” అన్నాడు. దాంతో వెంకటేశం అదేంటన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం కొంచెం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”అసలు కలలో వచ్చింది. కలెక్టర్‌ వెంకటేశమోయ్‌.. కలెక్టర్‌ కావడం అంటే అదేం చిన్న ఎచీవ్‌మెంట్‌ కాదు. ఎన్నో వేల మంది కంటే మెరుగయిన ప్రతిభ చూపించి తమని తాము నిరూపించుకున్నవారని. అందుకే  కలెక్టర్‌ అయ్యేసరికి ఆ అధిక్యపు భావం వారిలో వచ్చి చేరడం సాధారణం. సరే.. అదలా ఉంచు. యిప్పుడు విషయంలోకి వస్తే.. కలెక్టర్‌ అంటేనే ఎన్నో బాధ్య తలూ, ఒత్తిళ్ళూ ఉంటాయి. వీటన్ని టికి తోడు రాజ కీయంగా అజమాయిషీలు యింకోవైపు. యిదంతా వారిలో ఒక్కోసారి అసహనాన్ని పెంచొచ్చు. యిలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకి సంబంధించిన ఎమ్‌సిఐని రద్దుచేసి, దాని స్థానే ఏర్పాటు చేసిన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ డాక్టర్లపై ఐయ్యేయస్‌లాంటి ప్రభుత్వస్థాయి అధికారులకు పెత్తనానికి అవకాశం యిస్తుంది. వాళ్ళేం న్యాయం చేయగలరని? ఎమ్‌సిఐలో ప్రతీ రంగంలోలాగే  కొందరు తప్పుడుగాళ్ళుండవచ్చు. అంత మాత్రం చేత మొత్తంగా ఎంసిఐనే రద్దు చేసేసి,  అసలు ఈ రంగానికే సంబంధంలేని ఈ రంగంలో కష్టసుఖాలు గురించి లోతైన అవగాహన లేని వారిని తీసుకొచ్చి వారి మీద అజమాయిషీకి రుద్దడం ఏం న్యాయం? ఎక్కడయినా తప్పులున్నప్పుడు, ఆ తప్పుల్ని దిద్దాలే తప్ప మొత్తం ఆ వ్యవస్థనే రద్దు చేసేస్తారా? అంటే  ఆలోచించాలి” అంటూ వివరించాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here