ఎస్తేరు రాణికి ఘన నివాళి

0
370
రాజమహేంద్రవరం, ఆగస్టు 9 :  జియోన్‌ అంధుల పాఠశాలలో ఎస్తేరు రాణి ప్రథమ వర్థంతి సభ పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైకాపా సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతోమంది అంధులకు మంచి జీవితాన్ని ప్రసాదించి ఉన్నతమైన భవిష్యత్తును చూపించిన సేవాతత్పరురాలు ఎస్తేరు రాణి అని కొనియాడారు. ఆమె ఆశయాలను వారి కుటుంబ సభ్యులు నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర నిర్వాహకురాలు గుబ్బల రాంబాబు, పాస్టర్‌ జాన్‌ వెస్లీ, వాకచర్ల కృష్ణ, కానుబోయిన సాగర్‌, అందనాపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here