ఎస్సీ కళాశాల హాస్టల్‌  విద్యార్ధుల రాస్తారోకో       

0
315
రాజమహేంద్రవరం, ఆగస్టు 2 : ఎస్సీ కళాశాల హాస్టల్‌  విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్‌ చేస్తూ స్ధానిక వై.జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎస్సీ కళాశాల బాలుర వసతి గ హంలో వసతులు కల్పించాలని, శాశ్వత సిబ్బందిని నియమించాలని కోరుతూ దాదాపు అర్ధగంట పాటు విద్యార్ధులు రోడ్డుపై బైటాయించారు. ఉదయం దాదాపు అర్ధగంట పాటు రాస్తారోకో జరగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. హాస్టల్లో విద్యుత్‌, నీరు వంటి మౌళిక సదుపాయాలు లేవని, శాశ్వత సిబ్బంది లేరని, తాత్కాలిక వంట సిబ్బందికి విద్యార్ధుల స్కాలర్‌ షిప్‌ల నుండే జీతాలు చెల్లిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలను అధికారుల ద ష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ హాస్టల్స్‌ లో గత20 ఏళ్ళగా శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం నియమించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్ధులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here