ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవికి కాశి నవీన్‌ రాజీనామా

0
238
రాజమహేంద్రవరం, జూన్‌ 12 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవికి కాశి నవీన్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నిర్వహించి దళిత జాతి అభ్యున్నతికి కృషి చేశానన్నారు.ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలో 6627 మందికి సబ్సిడీ ద్వారా రూ.54.81 కోట్ల రుణాలు అందించామని అన్నారు. ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి. పధకం ద్వారా రూ.689.20 లక్షలతో 40 మందికి ఇన్నోవా కార్లు,23 మందికి రూ.221.49 లక్షలతో ఇటియోస్‌ కార్లు, ఏడుగురికి రూ.53.90 లక్షలతో ట్రాక్టర్లు, రెండు వందల మందికి రూ.665.60 లక్షలతో వివిధ వ్యాపారాల ఏర్పాటుకు రుణాలు అందించామన్నారు. ఎన్‌.ఎస్‌.కె.ఎఫ్‌.డి.సి.ఒధకం ద్వారా 62 మందికి రూ.930 లక్షలతో మెకనైజ్డ్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ మెషిన్లు అందజేశామని, 828 మందికి రూ.1707.93 లక్షలతో పవర్‌ ఆటోలు, నలుగురికి రూ.ఆరు లక్షలతో ఐ.ఎస్‌.బి. యూనిట్లను మంజూరు చేశామన్నారు. చంద్రబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌, స్థానిక నేతల సహకారంతో దళితుల అభ్యున్నతికి కృషి చేశానని పేర్కొన్నారు. పార్టీ ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని నవీన్‌ కుమార్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here