ఎస్సీ, బిసీ రుణాల దరఖాస్తులకు గడువు పెంచాలి

0
287
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  13 : నగరానికి సంబంధించి  ఎస్సీ, బిసి కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి  ఈ నెల 18 ఆఖరు తేదీగా నిర్ణయించారని, అయితే అంతకు ముందు అన్నీ పండుగ రోజులు రావడం వల్ల ప్రభుత్వ సెలవు దినాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు,  మీ సేవా కేంద్రాలు మూతపడ్డాయని బహుజన సమాజ్‌ పార్టీ  జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు తెలిపారు. కుల, ఆదాయ, నివాస ధృవ పత్రాలకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి కనీసం 15 రోజులు కాలయాపన జరగవచ్చని ముందుగా చెబుతున్నారన్నారు. కాబట్టి గడువును నెలాఖరు వరకు పొడిగించాలని ఆయన కోరారు. అదే విధంగా ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ లోన్‌ నిమిత్తం పేద యువతీ యువకులు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు లోన్‌ నిమిత్తం దరఖాస్తు చేసినా బ్యాంక్‌ విల్లింగ్‌   లభ్యం కాక నిజమైన అర్హులు నేటికి దూరమైపోతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై  బాధ్యతగా తీసుకుని నిజమైన అర్హులకు రాజకీయ ప్రమేయం లేకుండా రుణాలు రుణాలు ఇప్పించి వారి జీవన ప్రమాణాలననఱు మెరుగు పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బర్రే మరియా,పట్నాల విజయ్‌కుమార్‌, అప్పికొండ వెంకటలక్ష్మీ, వైభోగుల  లక్ష్మీ, పొన్నాడ కామేశ్వరి,తోనంగి పార్వతి, లోనంగి లక్ష్మీ, గోరు సింహాచలం, చిన్ని, రమేష్‌, మనోజ్‌, రాజు పాల్గొన్నారు.