ఎస్సీ వర్గీకరణ కోరుతూ ధర్మపోరాట దీక్ష

0
286
నవంబర్‌ 30న ఛలో విజయవాడ జయప్రదం చేయండి : పేరుపోగు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 30 : వచ్చేనెల 30వ తేదీన ఎస్సీవర్గీకరణ కోరుతూ విజయవాడలో ధర్మపోరాట దీక్ష చేపడుతున్నట్లు రాష్ట్ర ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ వెల్లడించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ మాదిగ జాతి హక్కులు, అస్తిత్వం, ఆత్మగౌరవం, సమగ్రాభివృధ్ధి కోసం జరిగే అంతిమ పోరాటంలో మాదిగలంతా భాగస్వామ్యులై ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎస్సీవర్గీకరణ చేసి పెద్దమాదిగను అవుతానని మాదిగలకు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక యూ టర్న్‌ తీసుకుని మాలలకు పెద్దపీట వేశారని ఆరోపించారు. రాజ్యాంగపరమైన అనేక పదవులను మాలలకే కట్టపెట్టారని ఆరోపించారు. ఎస్సీవర్గీకరణ అమలు అయ్యేలా కేంద్రాన్ని ఒప్పించాలని, లేకుంటే ఒచ్చే ఎన్నికల్లో కేజీ బంగారం ఇచ్చినా సరే మాదిగలు చంద్రబాబుకు ఓటు వేయరన్నారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు బల్లంకుల రాజు మాదిగ, రాష్ట్ర సమన్వయకర్త కొడవలి బుజ్జిబాబు మాదిగ, కూపర్‌ బుజ్జి, జయరాజు, జి రమేష్‌, శివ, ఎ శ్రీను మాదిగ, జీ శ్రీను మాదిగ, సిహెచ్‌ రవి, కుమార్‌స్వామి, వై రమేష్‌, ఏసు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here