ఏరీ మన స్టార్లు

0
530

 

భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాలు రెండూ వణికిపోతున్నాయి…పల్లపుప్రంతాలలో నిర్వాసితుల బాధలు టీవీలలో చూస్తూంటే హృదయవిదారకంగా వున్నాయి…ప్రభుత్వాలు ఉపశమనచర్యలు చేపట్టినా ప్రజలు విపత్తులో వున్నపుడు ఆదుకోవలసిన సామాజికబాధ్యత ఈ ప్రజల మూలంగా ఉన్నతస్థాయి లో వున్నవారికి కూడా వుండాలి…గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి సినీనటులు ఆయా సందర్భాలలో స్పందించి ప్రజల్లోకి వచ్చేవారు..వారందించిన సాయం ఎంతైనా కావచ్చు..అయితే ఆ సేవాస్ఫూర్తి మేమున్నామన్న భరోసా ఆపన్నులకు మనోస్థైర్యాన్నిచ్చేది…గత సంవత్సరం చెన్నై వరదలలో తమిళసినీనటులు స్పందించిన తీరు ప్రశంసనీయం…మన తెలుగు వాడైన నటుడు విశాల్ మొలలోతు నీళ్లలో నానుతూ ప్రజలకు మనోధైర్యాన్ని కలిగిస్తూ సహాయం అందించిన తీరు ఆదర్శనీయం…మరి మన సూపర్ స్టార్లూ నటవారసులూ నటసింహాలూ ఈ విపత్సమయాల్లో ఎక్కడైనా కనిపించారా…కనీసం వారు అంటిపెట్టుకుని వేలాడుతున్న భాగ్యనగరంలోనైనా…సినిమా నటులంటే రక్తాలుధారపోసి పాలాభిషేకాలూ నోట్లాభిషేకాలూ చేసే పిచ్చి అభిమానులూ…ఆలోచించండి…