ఏర్పాట్లలో లోపాలు లేవు

0
299

సోమయాజుల కమిషన్‌ ఎదుట ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు – 27కి వాయిదా

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ సోమయాజులు ఏకసభ్య కమిషన్‌ ఈరోజు ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది సిహెచ్‌.ప్రభాకరరావు మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేవని, అన్ని శాఖలు సక్రమంగానే విధులు నిర్వర్తించాయని చెప్పారు. జస్టిస్‌ సోమయాజులు మాట్లాడుతూ ఈనెల 27కి విచారణ వాయిదా వేస్తున్నామని, ఆలోగా ప్రభుత్వ తరపు వాదనలు పూర్తి కావాలని సూచించారు. ఈనెల 29తో కమిషన్‌ గడువు ముగియనుంది.