ఐకమత్యం – అందులో పైత్యం

0
201
మనస్సాక్షి  – 1140
వెంకటేశానికి చిన్న బాధ ఉండిపోయింది. అది.. తను చాలా గొప్పోడిననీ, ఎవరూ  ఆ గొప్పతనమేదో గుర్తించడంలేదనీ, అక్కడికీ ఎప్పుడయినా గంగలకుర్రు వెళ్ళినప్పుడు  ఊరి వాళ్ళు ‘ఎంకన్నబాబూ.. నీ అంత చదువు కున్నోడూ, తెలివైనోడూ మనూళ్ళో యింకె వరూ లేరు. నువ్విక్కడే ఉండిపోతే బాగుం టుంది అంటుంటారు. అది మాత్రం వెంక టేశానికి మహదానందంగా ఉంటుంది.  యిక గిరీశంగారయితే ఎంతసేపటికీ తన మీద జోకులేయడం తప్ప మెచ్చుకునేదే ఉండదు. అలాంటిది యిన్నాళ్ళకి వెంక టేశం ప్రతిభకి గుర్తింపు వచ్చినట్టయింది. ఆరోజు కూడా వెంకటేశం ఎప్పటిలాగే గిరీశం గారింటికొచ్చాడు.  ఆపాటికి గురువుగారు లేరు. బయట కెళ్ళారు. దాంతో వెంకటేశం హాల్లో కూర్చుని పేపరు తిరగేయ సాగాడు.  అప్పుడు జరిగిందది. ముందుగా బయట చిన్నపాటి కలకలం వినిపించింది. ఏవయిందా అనుకునేలోపు బయట్నుంచి బాబీగాడు లోపలకొచ్చాడు. ఆ వెనుక యింకో పదిమంది కుర్రాళ్ళు కూడా వచ్చేశారు. దాంతో వెంకటేశం అర్థం కానట్టుగా ”ఏవ యిందిరా.. ఏదయినా సినిమాకి వెడుతున్నారా?” అన్నాడు. బాబీగాడు తల అడ్డంగా ఊపి ”ఆ.. ఎవరో తీసిన సినిమా చూట్టంలో క్రియేటివిటీ ఏవుంది బాబాయ్‌… అసలు ఆ క్రియేటివిటీ ఏదో మనమే చూపిస్తే బాగుంటుంది కదా..” అన్నాడు. దాంతో వెంక టేశం అదిరిపోయి ”హార్నీ… నీలో చాలా కళలున్నాయిరా” అన్నాడు.  యింతలో బాబీగాడు ”అసలు మేము మా క్రియేటివిటీ చూపించాలంటే ముందు నీ క్రియేటివిటీ చూపించాలి బాబాయ్‌” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టు ”నేనేం చేయాల్రా?” అన్నాడు. ఈసారి బాబీగాడు ”ఏం లేదు బాబాయ్‌.. రేపు సాయంత్రం మా స్కూల్లో నాటకాల పోటీలున్నాయి. దాంట్లో మేమంతా  ఓ నాటకం వేద్దామనుకుంటున్నాం. నువ్వు  నీ క్రియేటివిటీ ఉపయోగించి ఓ నాటకం రాసిపారేస్తే మేమంతా యాక్ట్‌ చేసేస్తాం” అన్నాడు. దాంతో వెంకటేశం నోరెళ్ళబెట్టి ”అదెలా కుదురుతుందిరా.. నాటకం రాయడం అంటే బోల్డంతసేపు క్రియేటివిటీతో ఆలోచించాలి. తర్వాత పాత్రల్ని సృష్టించాలి. సీన్లు డైలాగులు రాసుకోవాలి” అన్నాడు. అయినా బాబీగాడు అదేం పట్టించుకోకుండా ”నువ్వు నాటకం రాసివ్వు బాబాయ్‌.. తర్వాతది మేం చూసుకుంటాం. నీలో ఎలాగా బ్రహ్మాండ మయిన క్రియేటివిటీ ఉంది కదా” అన్నాడు. దాంతో వెంకటేశం నిట్టూర్చి ”ఆ.. ఒకప్పుడు ఉండేదిలే మీ మావయ్య పొగదెబ్బతో అది పొగచూరిపోయిందిరా… సరేలే.. యిప్పుడే ఆలోచిస్తా” అన్నాడు. దాంతో బాబీగాడి గ్యాంగంతా ఆడుకోడానికి యింటి వెనక్కి పరిగెత్తారు. ఈలోగా వెంకటేశం ఆలోచించడం మొదలెట్టాడు. అప్పుడు గుర్తిచ్చిందో కథ. దాంతో చకచకా ఆ కథని ఎలా నాట కంగా మలచాలా అని ఆలోచించి, అప్పుడు వాళ్ళని పిలిచాడు. వెంకటేశం ముందుగా హాల్లో నేలమీద చాక్‌పీస్‌తో మనిషి తల, శరీరం, కాళ్ళూ చేతులూ ఉండేలా ఓ అవుట్‌లైన్‌ గీశాడు. తర్వాత వాళ్ళలో ఒకడిని తల స్థానంలో కూర్చోబెట్టాడు. యింకొకరిని పొట్ట స్థానంలో, యిద్దర్ని రెండు కాళ్ళ స్థానంలో, యింకో యిద్దర్ని రెండు చేతుల స్థానంలో కూర్చోబెట్టాడు. అలా మొత్తానికి పదిమందినీ మనిషి శరీరం ఆకారంలో కూర్చోబెట్టాడు. తర్వాత ఎవరేం డైలాగులు చెప్పాలో చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్నారు. అప్పుడు ఆ నాటకం రిహార్సల్‌ మొదలుపెట్టారు. ముందుగా సూత్రధారి పాత్రధారి అయిన ఓ కుర్రాడు ఆ శరీరం దగ్గరకొచ్చి అంతా సంతృప్తిగా చూసి, తలాడించి అక్కడ్నుంచి నిష్క్రమిం చాడు.  ఆ తర్వాత కుడిచేయి పాత్ర పోషిస్తున్న కుర్రాడు లేచి ”అసలు  శరీరం అంతటికీ నేనే ముఖ్యం. నేనే కష్టపడి పనిచేసి సంపా దించకపోతే యిక శరీరాన్ని పోషించేదెవరు? అందుకే నేనే గొప్ప” అన్నాడు. తర్వాత కుడికాలు పాత్రధారి లేచి ”కాదు..కాదు.. నేనే గొప్ప. నేనే లేకపోతే శరీరం ఎలా నడుస్తుందని? శరీరం నడవక పోతే యింక సంపాదన ఏముంటుందని?” అన్నాడు. యింతలో రెండో కాలు పాత్రధారి లేచి ”ఆ ఒక్క కాలూ ఉంటే సరిపోతుందా.. నేనూ ఉండాలి కదా” అన్నాడు. తర్వాత పొట్ట పాత్ర ధారి లేచి ”అసలు తిన్నదంతా నా దగ్గర దాచి ఒక్కో  అవయవానికీ పంపుతాను. అందుకే నేనే గొప్ప” అన్నాడు. తర్వాత తల, యితర అవ యవాలన్నీ తామే గొప్పని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ అవ యవాలన్నిటిలో ఎవరు గొప్పని తేలలేదు.  దాంతో అవయవా లన్నీ యింకేం చేయ కుండా అలా సైలెం టయిపోయాయి. ఈలోగా సూత్రధారి తిరిగి రావడం జరిగింది. ఓసారి అన్ని అవయవాల వంకా చూసి అంతా ఈసురోమంటూ ఉండడం చూసి ఏవయిందని అడిగాడు. దాంతో తల జరిగిందంతా చెప్పడం జరిగింది. అంతా విన్న సూత్రధారి ”మీ అందరి వాదనలూ తప్పే. మీలో ఎవరూ ఎక్కువా కాదు. ఎవరూ తక్కువా కాదు. అందరూ గొప్పే. ఎవరు లేకపోయినా శరీరం పనిచేయదు. మీరంతా సమైక్యంగా ఉండి పనిచేస్తేనే శరీరం బాగా పనిచేసేది”అంటూ హితబోధ చేసి అక్కడ్నుంచి నిష్క్ర మించాడు. అక్కడితో ఆ రిహా ర్సల్‌ ఏదో ముగిసింది. అంతా అయ్యాక పిల్లలంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. బాబీ గాడయితే వెంకటేశం దగ్గరకొచ్చి ”బాబాయ్‌.. నీ క్రియేటివిటీ సూపర్‌. రేపు మా నాటకం అయి పోగానే  నీ ఫొటోకి దండేసేస్తాం” అన్నాడు. దాంతో వెంకటేశం  కంగారుపడి ”అంత పనిమాత్రం చేయకండ్రా” అన్నాడు. దాంతో బాబీగాడూ, మిగతా పిల్లలూ బయటికిపోయారు.  వాళ్ళలా బయ టికి పోయాక గిరీశం లోపలకొచ్చాడు. ”మొత్తానికి ఆ పాతకాలం నాటి కథతో నాటకం వేయించేసి  పేరుకొట్టేసేవన్నమాట” అన్నాడు. దాంతో వెంక టేశం అందంగా పేరు కొట్టేసేవన్నమాట” అన్నాడు. దాంతో వెంక టేశం అందంగా సిగ్గుపడ్డాడు. ఈలోగా గిరీశం అక్కడో కుర్చీలో సెటి లయి ”అయినా యిందులో యిప్పుడు జరుగుతున్న గొప్ప చరిత్ర ఉందోయ్‌” అన్నాడు. వెంకటేశం అదేం టన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ”2014 నాటికి మోడీగారి గ్రాఫయితే బ్రహ్మాం డంగా ఉందన్నది నిజం. అయితే కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆ గ్రాఫ్‌ గణ నీయంగా పడిపోతూ వచ్చిదనేది నిజం. అయితే అనూహ్యంగా గత సంవత్సర కాలంగా అదేదో పుంజుకోవడం జరి గింది. అయితే అది ఎంతస్థాయిలో పుంజుకుందో తెలియదు. యింకోపక్క బీజేపీ యేతర పక్షాలన్నీ ఒకటయి బలమైన పోరాటం మొదలెట్టాయి. అయితే ఓ రకంగా కప్పలతక్కెడలాంటి ఆ యిరవై పార్టీలనీ ఓ తాటిమీదకి తెచ్చింది మన బాబుగారన్నది నిజం. కొన్ని సర్వేలు చెప్పినట్టుగా బీజేపీకి స్పష్టమయిన మెజా రిటీ రాకపోతే కేంద్రాన్ని పాలించేది ఈ 20 పక్షాల కూటమే అనుకోవాలి. అయితే యిక్కడ సమస్యల్లా వీళ్ళంతా ఎంతవరకూ నిబద్ధతతో వ్యవహరిస్తారని..! ‘మా పార్టీ యింత గొప్ప. మాకిన్ని మినిస్టర్‌ పోస్టులు కావాలి’ లాంటి గొడవలకి దిగితే అసలుకే ఎసరొస్తుంది. అందుకే బాబుగారు సామ్యవాదం టైపులో ”రాబోయే ఫలితాలతో సంబం ధం లేకుండా 21వ తారీఖున మనం అంతా కలిసి ఏ పార్టీకి ఎన్ని మంత్రులు కావాలో, పీఎం ఎవరో నిర్ణయం చేసుకుందాం. ఫలితాలొచ్చాక గొడవుండదు” అన్నాడు. అయితే దానికి మమత ఒప్పుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ  టైపులో’ లేదు..లేదు.. 23న ఫలితాలొచ్చాకే అవన్నీ నిర్ణయించుకుందాం’ అని ఎవరిస్థాయికి వాళ్ళ కంత ఫలాలు అన్నట్టుగా మాట్లాడింది. ఏతావాతా చెప్పేదేంటంటే.. బలమయిన బీజేపీకి అధికారం రాకుండా చేయాలంటే ముందు ఈ పార్టీలన్నీ సమైక్యవాదం అలవరచు కోవాలి. లేకపోతే రేపొకవేళ బీజేపీకి అవసరమయిన మెజారిటీ రాకపోయినా అతి పెద్ద పార్టీగా అవతరిస్తే మహా మాంత్రికుడు అమిత్‌షా ఈ యిరవై పార్టీల్లో  ఏర్పాటు చేసేస్తాడు” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here