ఐక్యతతోనే హక్కుల సాధన

0
100
ఎలక్ట్రీషియన్‌డేలో టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు
రాజమహేంద్రవరం, జనవరి27: కార్మికులు ఐక్యంగా వున్నప్పుడే హక్కులు సాధించుకోగలరని టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు అన్నారు. స్ధానిక సాయిరామ్‌ ఫంక్షన్‌హాల్‌లో ది న్యూ రాజమండ్రి  ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్‌ డేను నిర్వహించారు. 140 సంవత్సరాల క్రితం విద్యుత్‌బల్బును కనిపెట్టడం ద్వారా థామస్‌ ఆల్వా ఎడిసన్‌ ప్రపంచనాకి వెలుగు నింపారని, బల్బు కనిపెట్టిన జనవరి27వ తేదీన ఎలక్ట్రీషియన్స్‌డేగా ప్రభుత్వం గుర్తించడం సంతోషించతగిన విషయమన్నారు. ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ కార్మికుల డిమాండ్లను కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. కార్మికులకు ఇఎస్‌ఐ సదుపాయం కల్పించాలని  ఆయన కోరారు. ప్రైవేట్‌  ఎలక్ట్రికల్‌ కార్మికులు అందరూ కార్మికసంక్షేమబోర్డులో రూ.110 చెల్లించి సభ్యత్వం పొందడం ద్వారా సంక్షేమ పధకాలు వర్తించేటట్టుగా చూసుకోవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న మన్యం నవీన్‌ ఎలక్ట్రికల్స్‌ అధినేత మన్యం నవీన్‌ మాట్లాడుతూ ధామస్‌ ఆల్వాను మరిచిపోకుండా ఆయన బల్బును ఆవిష్కరించిన రోజును ఎలక్ట్రీషియన్స్‌డేగా పాటించడం ఎలక్ట్రీషియన్లకు గుర్తింపుగా తెలిపారు. ఈ సందర్బంను పురస్కరించుకుని ది న్యూ రాజమండ్రి ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారు ఎలక్ట్రీషియన్‌ డేను నిర్వహించడం ధామస్‌ ఆల్వాను స్మరించుకోవడం ఆయనను గౌరవించుకోవడంగా పేర్కొన్నారు. కార్మికులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అసోసియేషన్‌ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇకపై ప్రతిఏటా జనవరి27వ తేదీని ఎలక్ట్రీషియన్‌డేగా పాటించి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర అసోసియేషన్‌తో అనుబంధం కలిగిన ది రాజమండ్రి ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసొసియేసన్‌ ద్వారా సంక్షేమ పధకాలు కార్మికులకు అందేలా కృషి చేయడంతో పాటుగా ఎవరికి ఏమి సమస్య వచ్చినా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, మన్యం నవీన్‌లను సత్కరించారు. కార్మికులను సన్మానించారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు కటకం కృపారావు, కోలాటి సువర్ణరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ కోమండూరి గణేష్‌బాబు, కార్యదర్శి పత్తి మహేష్‌, కోశాధికారి బోడకుర్తి గోపాలకృష్ణ(గోపి), జాయింట్‌ సెక్రటరీ మరడ పరశురామ్‌, సభ్యులు చింతపల్లి పోసి, ఎమ్‌డి.గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here