ఐక్య ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన

0
140
కోరుకొండ, మే1 : ఐక్య ఉద్యమాలతోనే కార్మికుల హక్కులను పరిరక్షించుకోగలుగుతామని శ్రీ పొన్నాలమ్మ కార్మికుల సంక్షేమసంఘం అధ్యక్షులు బొర్రా సుబ్బారావు అన్నారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంలో మేడే ఉత్సవాన్ని బుధవారం జరిపారు.   అంబేద్కర్‌ ఆలోచనావిధానంలో కార్మిక, కర్షక, మహిళల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఉపాధి హామీకూలీలు, భవన నిర్మాణరంగంలో కార్మికులు, పెయింటింగ్‌, ఆటో, రైతు కూలీలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయా రంగాల్లో కార్మికుల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వారికి ఫించన్‌ సౌకర్యం కల్పించాలని, ఇఎస్‌ఐ సదుపాయం వర్తింపచేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా వృద్దమహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్మికులకు యూనిఫామ్స్‌  అందచేశారు. ఈ సందర్బంగా కార్మికుల పిల్లల్లో ప్రతిభ చూపిన వారికి గోల్డ్‌మెడల్స్‌ అందచేశారు. ఈ కార్యక్రమంలో అడ్డాల భద్రరావు, మట్టా వెంకటేశ్వరరావు, కోనాల మంగాదేవి, గొల్లా చిలకమ్మ, మడికి సుభద్రమ్మ,  యోహాను, జనిపెల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here