ఓఎన్‌జీసిలో విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభం  

0
330
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 :  ఓఎన్‌జీసిలో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అవినీతిని నిర్మూలించాలనే నినాదంతో  ఈ ఏడాది నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా స్ధానిక ప్రకాశం నగర్‌ డిస్పెన్సరీ నుంచి బేస్‌ కాంప్లెక్స్‌ వరకు  ఐదు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.  ఓఎన్‌జిసీ రాజమండ్రి అసెట్‌ మేనేజర్‌ దేబశీష్‌ సన్యాల్‌ నేతృత్వంలో దాదాపు 200 మంది ఉద్యోగులు అవినీతిని అంతం చేస్తాం అనే నినాదాలతో ప్లకార్డులు చేతబట్టి ఈ నడక నిర్వహించారు. ఈ సందర్భంగా సన్యాల్‌ మాట్లాడుతూ  అవినీతిని నిర్మూలించడానికి ఓఎన్జీసీలో అధునాతన వ్యవస్థలు ఉన్నాయని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగంలోని వారు క్రియాశీలక చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం బేస్‌ కాంప్లెక్స్‌లో  జరిగిన కార్యక్రమంలో  ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. వారం రోజుల పాటు జరిగే విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిర్మూలనపై ఉద్యోగులకు,విద్యార్ధులకు వివిధ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో తమిళనాడు రిటైర్డ్‌ డీజిపి రామకృష్ణన్‌ పాల్గొంటారు. ఇంగ్లీష్‌లో సన్యాల్‌, హిందీలో జీజీఎం ఏకె లాల్‌,  జీఎం సతీష్‌కుమార్‌లు వేర్వేరు భాషల్లో ప్రతిజ్ఞ చేయించారు.