ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి : గోరంట్ల 

0
368
అమరావతి, మే 29 : సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజమమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన టీడీఎల్పీ సమావేశానికి హాజరైన సందర్భంగా ఈ ఉదయం బుచ్చయ్యచౌదరి మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయి వాస్తవాలను విడిచి సాంకేతికతను నమ్మడమే ఓటమికి మరో కారణమా అని విశ్లేషించాల్సి ఉందని గోరంట్ల అన్నారు. గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినా.. అప్పుడు తన మాటలు పట్టించుకోలేదన్నారు. అయినా మళ్లీ చెబుతున్నానని, పార్టీ బాగుకోసం సూచనలు చేస్తానని గోరంట్ల వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా  కులాల ప్రస్తావన  వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబే ఉండాలని,  ఆయన ముందుంటేనే తమకు ధైర్యమని అన్నారు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి నేతలు చంద్రబాబుని స్వయంగా వచ్చి ఆహ్వానించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని గోరంట్ల వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here