ఓటుని అమ్ముకోవద్దు – కోటు గుర్తుకి వోటివ్వండి

0
295
అంబేద్కర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి డేవిడ్‌ నెల్సన్‌
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 8 : ఓటుని అమ్ముకోవడం,కొనుక్కోవడం దారుణమని అంబేద్కర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాజమహేంద్రవరం ఎంపీ  అభ్యర్థి గెడ్డం డేవిడ్‌ నెల్సన్‌ పేర్కొంటూ దయచేసి ఓటుని అమ్ముకోవద్దని కోరారు. ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెలకు లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు సైతం ఓటుని అమ్ముకోడానికి సిద్ధ పడుతున్నారేంటీ పేదరికం ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాలంటే అంబేద్కర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.  ప్రజలు స్వశక్తితో సంపాదించుకునే వెసులుబాటు కల్పించాలన్నదే తమ పార్టీ ధ్యేయమన్నారు. కోటు గుర్తికి ఓటు వేసి ఎంపీగా తనను,రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి బూరిగ ఏసుదాసు ని  గెలిపించాలని కోరారు. రూరల్‌ నియోజకవర్గం నుంచి వెల్ఫేర్‌ పార్టీ అభ్యర్థిగా విజిల్‌ గుర్తుపై  పోటీచేస్తున్న కొల్లాబత్తుల రిచ్‌ మండ్‌ కేరిని తమ పార్టీ బలపరుస్తోందని ఆయన చెప్పారు. నగర పార్టీ అధ్యక్షుడు సింగ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here