ఓడలు – బళ్ళు

0
146
మనస్సాక్షి  – 1143
”అబ్బబ్బ.. జీవితం బొత్తిగా డ్రై అయి పోతుంది గురూగారూ” అన్నాడు వెంక టేశం వస్తూనే. ఆపాటికి వంటింట్లో చెయ్యి కాల్చుకుంటున్న గిరీశం ”అయితే నీకేవ యినా పిల్లని చూసి పెళ్ళి చేయాలం టావా?” అన్నాడు. దాంతో వెంకటేశం కంగారుపడిపోయి ”ఉన్నా తలనొప్పులు చాల్లే గురూగారూ.. నేననేది రాజకీయాల గురించి. ఎలక్షన్లు అయిపోయాయి కదా. మళ్ళీ అయిదేళ్ళ దాకా అంతా డ్రైనే కదా” అన్నాడు. దాంతో గిరీశం ”అదే పొర బాటోయ్‌.. రాజకీయాలంటే నిరంతర బురద ప్రవాహంలాంటివనుకో. ఎప్పుడూ ఏవో బురద చిందుతూనే ఉంటాయి” అన్నాడు పొయ్యిమీద  చారుదించుతూ. అక్కడ్నుంచి యిద్దరూ హాల్లోకొచ్చారు. యింతలో వెంకటేశం ”అయినా ఆరోజుల్లో ఎంత ఆరోగ్యకరమయిన పరి స్థితులుండేవి గురూగారూ.. నా చిన్నప్పుడు మనూళ్ళో ఏ పార్టీ అభ్యర్ధి అయినా గెలిచినప్పుడు ఊరంతా ఊరేగడం అలవాటు. అలా ఊరేగుతూ ఓడిపోయిన అభ్యర్ధి యింటిమీదుగా వెడు తున్నప్పుడు ఆ ఓడిపోయిన అభ్యర్ధి యింట్లోంచి బయటకొచ్చి గెలిచిన విజేత మెడలో దండేసి అభినందించేవాడు. అదెంత గొప్పగా ఉండేదని.. యిప్పుడలాంటి పరిస్థితులేవీ కనపడి చావడం లేదు” అన్నాడు నిరసనగా దాంతో గిరీశం ”అయితే ముందుగా  నీకో చిన్న ఊహలాంటిది చెబుతా. అప్పుడు నీ అభిప్రాయం మార్చు కుంటావు” అంటూ చెప్పడం మొదలెట్టాడు..
యయయ
లండన్‌.. ఆరోజక్కడ ఐసిసిలో ఈసీ సభ్యులు లోపాయికారీ సమావేశం ఒకటి  జరుగుతోంది. వాస్తవానికి ఐసిసికి సంబం ధించిన జనరల్‌ బాడీ మీటింగొకటి మర్నాడు ఉంది. అందులో ఓకే చేయాల్సిన అంశాల గురించే ఈ మీటింగ్‌. యింతలో మాల్కం లేచి నిలబడ్డాడు.ఓసారి అందరికీ విష్‌ చేసి ”గతంతో పోలిస్తే క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చేశాయి. అలాగే చాలా అభివృద్ధి చెందింది కూడా. అయితే క్రికెట్‌ అనేది ఒక కాలక్షేపం ఆటగా మిగిలిపోకూడదు. అది ఆడే దేశాల మధ్య స్నేహ సంబం ధాలు పెంచేదిగా ఉండాలి” అంటూ ఆపాడు. మాల్కం చెప్పిం దానికి అంతా తలలూపారు. యింతలో మాల్కం కొనసాగిస్తూ ”క్రికెట్‌ ఆడే దేశాలలో బద్ధ శత్రువులు ఎవరంటే యిండియా, పాకిస్థాన్‌. అలాంటి ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ వలన స్నేహ సంబంధాలు పెరిగితే అది మన క్రికెట్‌కి ఎంతో గౌరవం. అందుకే నేను  చెప్పేది ఎంతోకాలంగా నిలిచిపోయిన ఆ దేశాల మధ్య మ్యాచ్‌ల్ని తిరిగి పునరుద్ధరించాలి యిండియాలో ఓ సిరీస్‌ పెడితే పాకిస్థాన్‌లో ఓ సిరీస్‌ పెట్టాలి” అన్నాడు. యిదేదో అందరికీ నచ్చినట్టుగా చప్పట్లతో తమ అంగీకారం తెలిపారు.
యయయ
కరాచి.. మూడునెలల క్రితం ఐసిసి నిర్ణయించిన ప్రకారం ఆరోజు కరాచిలో యిండియా, పాకిస్థాన్‌ల మధ్య వన్‌డే మ్యాచ్‌ మొద లయింది. అసలే యిండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ కావడంతో గ్రౌండంతా కిక్కిరిసిపోయింది. అయితే ఆ జనాలంతా పాక్‌ అభి మానులే. గ్రౌండ్‌లో ఏ మూల చూసినా పాకిస్థాన్‌ జండాలే రెపరెప లాడుతున్నాయి. మ్యాచ్‌ మొదలవగానే గ్రౌండంతా వాళ్ళ అరుపులతో దద్దరిల్లిపోయింది. ఎలా తెచ్చారో కొందరు అభిమానులు హేండ్‌ మైక్‌లు లోపలికి తెచ్చేశారు. అంతేకాదు. యిండియన్స్‌ ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు రకరకాల బూతులు మాట్లాడుతున్నారు. యిక యిండియా బ్యాటింగ్‌ చేస్తు న్నప్పుడయితే అంతా పెద్దస్థాయిలో చెవులు చిల్లులు పడేలా అరుస్తు న్నారు. దాంతో యిండియా జట్టు విపరీతమయిన ఒత్తిడికి లోనయింది.  చివరికి తన స్థాయిలో నాలుగోవంతు ప్రదర్శనే చేసి దారుణంగా ఓడిపోయింది.
యయయ
యిది జరిగిన నాలుగురోజులకి మళ్ళీ యిండియా, పాకిస్థాన్‌ల మధ్య యింకో మ్యాచ్‌ జరిగింది. అయితే ఈసారి మ్యాచ్‌ జరిగింది. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో. ఐసిసి అప్పు డప్పుడూ నిర్వహించే ఛారిటీ మ్యాచ్‌ కోసం ఈసారి యిండియా, పాకిస్థాన్‌లని ఎంచుకోవడం జరి గింది. యిక లార్డ్స్‌ గ్రౌండ్‌ అయితే అభిమాను లతో నిండిపోయింది. అయితే వారిలో కొందరు పాకిస్థాన్‌ అభిమానులయితే, యింకొందరు యిండియా అభిమానులు. విపరీత చేష్టలకి పోకుండా  ఎవరు బాగా ఆడితే దానికి తగ్గట్టుగా అభిమానులు ఎంకరేజ్‌ చేస్తున్నారు. యిక యిండియా అయితే పూర్తిస్థాయి సామర్ధ్యంతో ఆడి బ్రహ్మాండంగా గెలిచేసింది.  యిక పాకిస్థాన్‌ సంగతి సరేసరి. తన  క్రికెట్‌ చరిత్రలోనే అంత దారుణమయిన ఓటమి చూసుండదు..!
యయయ
మమతా బెనర్జీ అసహనంగా అటూయిటూ పచార్లు చేస్తోంది. ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని అవలీలగా పరిష్కరించిన  మమత యిప్పుడిలా ఉండడం ఆశ్చర్యమే. యిప్పుడొచ్చింది సమస్యంటే సమస్యా కాదు. యిబ్బందికరమయిన పరిస్థితంతే. దాంతో మమత గొప్ప సంఘర్షణలో పడిపోయింది. ఎలక్షన్‌ ముందు మోడీ మీద చాలా దారుణమయిన విమర్శలు చేసింది. తీరా చూస్తే మోడీ బ్రహ్మాం డంగా గెలిచేయడం జరిగింది. యిక తన రాష్ట్రంలో కూడా మోడీ పార్టీ తమ పార్టీ పునాదులు కదిలే స్థాయిలో సీట్లు గెల్చుకుని షాకివ్వడం జరిగింది.  యిలాంటి పరిస్థితుల్లో  మోడీ గారి ప్రమాణ స్వీకారానికి రమ్మని  ఆహ్వానం వచ్చింది. యిప్పుడు తమ వెళ్ళక పోతే బాగుండదు. మోడీగారి సక్సెస్‌ చూడలేక కుళ్ళుతో వెళ్ళ లేదనుకోవచ్చు. పోనీ వెడితే ఎలాగుంటుందా అని ఆలోచించడం మొదలెట్టింది. దాంతో వెడితే ఏం జరగొచ్చో చిన్న ఊహలా మెది లింది. మోదీ ప్రమాణ స్వీకారానికి వేలమందన్నా  సభకి వస్తారు.  అలాంటి జనాల మధ్య నుంచి తను వెడుతున్నప్పుడు ఏ కార్యకర్తలో గుంపుగా లేచి ”దీదీ డౌన్‌ డౌన్‌” అని అరవొచ్చు. లేకపోతే తనని అడ్డుకోవచ్చు. అలా ఏం జరిగినా అనుమానమే. అదంతా కళ్ళ ముందు కనపడేసరికి యిక మమత వెళ్ళే ప్రయత్నం మానుకుని తన అభినందన సందేశం పంపేసింది.
యయయ
”అదోయ్‌ విషయం” అన్నాడు గిరీశం. దాంతో వెంకటేశం ”యిదేదో అర్ధమయ్యీ కానట్టుగా ఉంది గురూగారూ” అన్నాడు. అప్పుడు గిరీశం ”మరేం లేదోయ్‌.. యిదంతా ఈ మధ్య ప్రమాణ స్వీకా రానికి వెళ్ళడం విషయంలో తర్జనభర్జనలు పడ్డ బాబుగారి గురించి” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం యింకా వివరంగా  చెప్పడం మొదలెట్టాడు.” మరేం లేదోయ్‌.. జగన్‌ తన ప్రమాణ స్వీకారోత్సవానికి బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఎలక్షన్‌ ముందు ఆ పార్టీల మధ్య బాగా శృతిమించిన స్థాయిలో తిట్లూ, వ్యక్తిగత విమర్శలూ, గొడవలూ చోటు చేసుకున్నాయి. యిలాంటి పరి స్థితిలో తను వెడితే జగన్‌ వరకూ బాగా మాట్లాడొచ్చుగానీ కింద స్థాయి కార్యకర్తలేవన్నా అదుపుతప్పి ప్రవర్తించొచ్చు. అదే జరిగితే తన నలభై ఏళ్ళ  రాజకీయ జీవితానికీ మాయని మచ్చగా మిగ లొచ్చు.  యివన్నీ ఆలోచించి తను వెళ్ళకుండా ముందుగానే  విషయం చెప్పుకుని తన వాళ్ళని పంపించడం జరిగింది. యిక చివరగా చెప్పేదేంటంటే.. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉం డదు. ఉన్న పార్టీలే అటూయిటూగా  అధికారంలోకొస్తుంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత దూషణలకి దిగడం, శృతి మించి మాటలు మీరడం  ఏ పార్టీకీ మంచిది కాదు. ప్రతిపక్షం అనేది ఎప్పుడూ అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలను నిశితంగా పరిశీ లిస్తూ అందులో లోటుపాట్లు చెప్పే నిర్మాణాత్మక  పాత్ర పోషిం చాలి. అది ఈ వ్యవస్థకి మంచిది. అలా అయితే పార్టీల నాయ కుల మధ్య  స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. అలాం టప్పుడు ఓటమిని కూడా హుందాగా స్వీకరిస్తారు” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here