ఓ వైపు పిలుస్తూ మళ్ళీ ఈ పొగేమిటి? 

0
369
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పీడిఎస్‌యు నిరసన   
 
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : ప్రభుత్వ హాస్టళ్ళను, కళాశాలలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఆ ఆలోచనను విరమించుకోకుంటే పిడిఎస్‌యు తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని పీడిఎస్‌యు రాష్ట్ర కోశాధికారి ఎస్‌.కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,856 పాఠశాలలు, 1356 సంక్షేమ హాస్టళ్ళను కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు దగ్గరుండి ఈ ప్రయత్నం చేయించడం బాధాకరమని అన్నారు. బ డి బాట, బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాలను ఓ వైపు చేపడుతూ వాటిని మూసివేసేందుకు కుట్రలకు పాల్పడుతోందన్నారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లుకు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తూ విదేశాల్లో నిషేధించిన యూనివర్శిటీలకు ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడిఎస్‌యు నూతన కమిటీని ఆయన ప్రకటించారు. నగర అధ్యక్షునిగా ఎస్‌ సాయితేజ, కార్యదర్శిగా కె ఎలీషా, నగర నాయకులుగా పి.అమిత, ఎస్‌.శ్రీహరి, డివిజన్‌ కార్యదర్శిగా  ఎస్‌.రవితేజ నియమితులయ్యారని తెలిపారు.