కంటి వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

0
437

అర్బన్‌ ఎస్పీ రాజకుమారి

రాజమహేంద్రవరం, జనవరి 30 : కంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అన్నారు. షెల్టన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌ కొడాలి తనూజ పర్యవేక్షణలో ఈరోజు షెల్టన్‌ హోటల్‌ వద్ద ఉచిత కంటి వైద్య, శస్త్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని అర్బన్‌ ఎస్పీ రాజకుమారి ప్రారంభించి తొలుతగా ఆమె కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మందికి కంటి వ్యాధులపై అవగాహన లేకపోవడంతో చూపు కోల్పొతున్నారని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి వైద్య పరీక్షలు తరుచుగా చేయించుకోవాలన్నారు. షెల్టన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున పేద, మధ్య తరగతి ప్రజల కోసం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడమే గాక శస్త్ర చికిత్సలు చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్ళను అందిస్తున్న కొడాలి తనూజను అభినందించారు. షెల్టన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున నగరంలో, పరిసర ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో షెల్టన్‌ ఎండీ కొడాలి సుధాకర్‌, నేత్ర వైద్యాలయ డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌, షెల్టన్‌ జీఎం ఉపేంద్ర సింగ్‌, ఆకుల ప్రకాష్‌, సత్తిరెడ్డి, నాగేశ్వరరావు, లైజనింగ్‌ ఆఫీసర్‌ చిలుకూరి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here