కంబాలచెరువు వద్ద ప్యారడైజ్‌ బిర్యానీ పార్శిల్‌ కౌంటర్‌

0
394

రాజమహేంద్రవరం, మార్చి 6 : నోరూరించే వంటకాలతో వివిధ రకాల ఆతిథ్యంతో స్వాగతమిచ్చే హోటల్‌ షెల్టన్‌ సంస్థ వారి ప్యారడైజ్‌ స్పైసీ బిర్యానీ పార్శిల్‌ కౌంటర్‌ను నగర ప్రజల సౌకర్యార్థం కంబాలచెరువు సమీపంలో ఏర్పాటు చేశారు. కంబాలచెరువు నుంచి నందం గనిరాజు జంక్షన్‌కు వెళ్ళే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌ను షెల్టన్‌ సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ చిలుకూరి సాయిబాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా షెల్టన్‌ ఎం.డి.కొడాలి సుధాకర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు మంచి వంటకాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షెల్టన్‌ జనరల్‌ మేనేజర్‌ ఉపేంద్రసింగ్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కె.రాజు, ఎఫ్‌ అండ్‌ బి మేనేజర్‌ కృష్ణ, మార్కెటింగ్‌ మేనేజర్‌ ధర్మేంద్ర పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here