కంబాల వాకర్స్‌ అసోసియేషన్‌ పింఛన్లు పంపిణీ

0
324
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : కంబాలవాకర్స్‌ సీనియర్‌ సిటిజన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బండారు మధుసూధనరావు ఆధ్వర్యంలో  పేదవారికి వృద్ధులకు, వికలాంగులకు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు రూ.200 చొప్పున 60 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు, రిటైర్డ్‌ ట్రజరీ ఆఫీసర్‌ సవిల్‌ పట్టాభి, రిటైర్డ్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పెంపురత్నం రూ.10వేల విరాళం  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుదే రాంబాబు, గోపి అప్పారావు, జె.కె.సుబ్బారావు, దాసరి సూర్యప్రకాశరావు, తోట గోవిందరాజులు, లింగయ్య, నెక్కంటి లక్ష్మి పాల్గొన్నారు.