కడపకు పయనమైన జిల్లా వాలీబాల్‌ జట్టు

0
353
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : రేపటి నుంచి డిసెంబర్‌ నాలుగో తేదీ వరకూ కడప జిల్లాలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరవ పురుషుల, స్త్రీల వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే తూర్పు గోదావరి జిల్లా పురుషుల జట్టు రాజమహేంద్రవరం నుంచి ఈరోజు బయలుదేరింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 21వ తేదీ నుంచి రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలోని శ్రీ పరిమి రామచంద్రరావు మెమోరియల్‌ వాలీబాల్‌ కోర్టులో కోచ్‌ కె.యశ్వంత్‌(జెస్సీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణకు హజరైన క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలను రాజమండ్రి వాలీబాల్‌ అసియేషన్‌ అధ్యక్షులు పరిమి వాసు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులకు అవసరమైన దుస్తులను ఈ ఉదయం పరిమి వాసు అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో పరిమి వాసు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి విజయంతో తిరిగి రావడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న క్రీడాకారులు ఆర్‌.ఇమ్మానుయేల్‌ రాజు, చరణ్‌, శరత్‌, శివ, ప్రసాద్‌, దొరబాబు, నవీన్‌, అశోక్‌, సాయి, వెంకన్న, వంశీ, బాబీలను అభినందించారు. ఈ జట్టుకు కోచ్‌గా కె.యశ్వంత్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా కె.శ్రీనివాస్‌, మేనేజర్‌గా కె.శ్రీకాంత్‌ జట్టుతో పాటు బయలుదేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here