కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలి

0
144
ఎం.పి. మార్గాని భరత్‌కు అంగన్‌వాడీల వినతి
రాజమహేంద్రవరం, జూన్‌ 12 : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని కోరుతూ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు. రిటర్మైంట్‌ బెనిఫిట్‌గా వర్కర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు లక్ష రూపాయలతోపాటు సగం నెల వేతనం పింఛనుగా అందించాలని కోరారు. అంగన్‌వాడీ సెంటర్లను విలీనం చేయాలని వచ్చిన 3211 మెమోను రద్దు చేయాలని కోరారు. బిఎల్‌ఓ, ఆన్‌లైన్‌ డ్యూటీలు రద్దు చేయాలని, కేంద్రం పెంచిన వేతనాలను మన రాష్ట్రంలో అమలు చేయాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోజ్‌ మేరి, శ్యామల, భాగ్యలక్ష్మి, శేషారత్నం, టి.విజయ, సునీత, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here