కమీషనర్స్‌

0
230
మనస్సాక్షి  – 1167
వెంకటేశానికి అర్జంటుగా బయ ల్దేరమని ఊర్నించి ఫోనొచ్చింది… అదీ గంగలకుర్రులో ఉన్న వెంక టేశం బామ్మ పరిస్థితి బాగాలేదని. దాంతో వెంక టేశం ఆదరాబాదరా ఆ ఊరు పరిగెత్తాడు. అయితే బామ్మ దగ్గర కెళ్ళాలంటే వెంకటేశానికి చిన్న గిల్టీ పీలింగ్‌ లాంటిది ఏదో ఉండి పోయింది. అసల  యితే సదరు బామ్మ చిన్నప్పట్నుంచీ వెంకటేశాన్ని ఎత్తుకుని పెంచింది. అప్పుడే ‘ఒరే ఎంకన్నా.. నువ్వెప్పటికయినా గొప్ప డాక్టరవ్వా లిరా. అప్పుడు నాకేం అనారోగ్యం వచ్చినా నువ్వే చూసుకోవచ్చు. అంటుండేది. దాంతో చిన్నప్పుడు వెంకటేశం డాక్టర్‌ అవుదామనే అను కున్నాడు. తీరా యింటర్‌లోకి వచ్చేసరికి అసలు బైపిసియే తీసు కోలేదు. పీజీలో మేనేజ్‌మెంట్‌ కోర్సులవైపు వెళ్ళిపోయాడు. అందుకే బామ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా  డాక్టర్‌ని కాలేకపోయానే అని  బాధపడిపోతుంటాడు. ఆరోజు కూడా అలాగే వెళ్ళాడు. వెంకటేశాన్ని చూడగానే బామ్మయితే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ”ఒరేయ్‌ ఎంకన్నా.. నువ్వు డాక్టరయితే నేను బతికేద్దునురా” అంది. దాంతో వెంకటేశం ఏవనుకున్నాడో ”యిదిగో బామ్మా.. నేనెలాగయినా డాక్టర్‌నవుతా” అంటూ మాటిచ్చాడు. ఆ తర్వాత యింకో రెండురోజులకి బామ్మ కాస్తా గుటుక్కుమనడం జరిగింది. అయితే అప్పట్నుంచీ వెంకటేశం డాక్టర్‌ కావడం ఎలా అని ఆలోచించేస్తున్నాడు. తనిప్పుడు నీట్‌ రాసేసి, ఎంబీబియస్‌ గట్రా చేసేసి డాక్టరయిపోవాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. మరేం చేయాలా అని ఆలోచించాడు గానీ ఏం తట్ట లేదు. అలా ఆలోచించగా ఆలోచించగా ఓ బ్రహ్మాండమయిన ఆలోచన తట్టింది. దాంతో వెంటనే రంగంలోకి దూకేశాడు.
——-
వెంకటేశం ముందుగా ఊళ్ళో చిన్న పిల్లలు తినే బల్లిగుడ్లలాంటివి  స్వీట్లు తయారు చేసే సంస్థకి వెళ్ళాడు. అదో చిన్న తరహా పరిశ్రమ. అక్కడ తియ్యగా ఉండే రంగురంగుల బల్లిగుడ్లలాంటివి తయారు చేసి డబ్బాల్లోకి ఎక్కిస్తున్నారు. అక్కడ్నుంచి అవన్నీ చిన్న చిన్న షాపులకి పంపడం జరుగుతుంది. వెంకటేశం వెళ్ళి ఆ ఓనర్‌ ఆనంద రావుని కలిశాడు. ”నాకు యిలాంటి బల్లిగుడ్లులాంటివి కావాలి. అయితే అవేవో యిలాక్కాకుండా రకరకాల షేపుల్లో అంటే గుండ్రంగా, చదరంగా, కోలగా ఉండాలి. అలాగే రకరకాల రంగుల్లో అంటే తెల్లగా, పచ్చగా, నీలంగా, గులాబీరంగులో ఉండాలి” అన్నాడు. ఆనందరావు తలూపి ”అలాగే చేయించేస్తా. అయితే వాటన్నింటికీ సెపరేట్‌ డైస్‌ చేయించాలి” అన్నాడు. వెంకటేశం తలూపి తనక్కావలసినవి ఏ షేపువి, ఏ రంగువి ఎన్ని కావాలో చెప్పాడు.
——-
వెంకటేశం యింటి ముందరో బోర్డు వెలిసింది. ‘యినిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాసి బో సైన్సెస్‌’ ప్రజలకి వైద్య సేవలు అందించాలనుకునేవారికి మహత్తర అవకాశం. అలాంటి వారికి మా యినిస్టిట్యూట్‌లో శిక్షణ యివ్వబడును. పదిరోజుల ఆ శిక్షణ ముగిసిన తర్వాత మేము పెట్టిన పరీక్షలో పాసయిన ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్లాసిబో టెక్నాలజీ’ (సి.పి.టి.) అన్న సర్టిఫికెట్‌ యివ్వబడుతుంది. ఫీజు కేవలం పదివేలు యిలా ఉందది. యింకా యిలాంటి ప్రకటనల బోర్డులు చాలా చోట్ల పెట్టించాడు. అప్పుడో విశేషం జరిగింది. అసలు వెంకటేశమేఊహించని స్థాయిలో జనాల్నుంచి స్పందన వచ్చింది. చాలా పెద్దస్థాయిలో జనాలు తరలి వచ్చారు. దాంతో వచ్చిన వాళ్ళందర్నీ బ్యాచ్‌లుగా విడదీసి వెంకటేశం క్లాసులు మొదలుపెట్టాడు. వెంకటేశం చెప్పిందేంటో అంతా శ్రద్ధగా వింటున్నారు. ”మన దగ్గరకొచ్చిన పేషంటుకి ఫీజు వెయ్యి రూపాయలు పెట్టాలి. ఒకవేళ మనం ఆ జబ్బు తగ్గించలేకపోతే ఫీజు వాపస్‌ అని చెబుతాం. అలాగే యిచ్చేస్తాం కూడా” అన్నాడు. దాంతో అక్కడ చిన్నపాటి సంచలనం రేగింది. యింతలో వెంకటేశం కొన సాగిస్తూ ”మన దగ్గరికి ముగ్గురు పేషంట్లు వచ్చారనుకుందాం. అందులో ఒకరికి తగ్గి, యిద్దరికి తగ్గలేదనుకుందాం. యిద్దరికీ ఆ డబ్బులేవో వెనక్కి యిచ్చేయండి. మొత్తానికి ముగ్గురి మీదా మనకి మిగిలింది వెయ్యి. అందులో ఈ ప్లాసిబోల ఖర్చు తీసేస్తే ఓ తొమ్మి దొందలు మిగిలినట్టవుతుంది. అంటే పేషంటు మీద మూడొందలన్న మాట” అన్నాడు. అంతా తలలూపారు. తర్వాత వెంకటేశం వాళ్ళకి తనకేదో కొద్దిపాటి అవగాహన ఉన్న వ్యాధుల గురించీ, శరీరంలో వేర్వేరు అవయవాల పనితీరు గురించీ వివరించాడు. అంతేకాకుండా తాను బయట తయారు చేయించిన రకరకాల షేపుల్లో, రకరకాల రంగుల్లో ఉన్న ప్లాసిబోలని కూడా  వేర్వేరు డబ్బాల్లో  పోసి యిచ్చాడు. మొత్తానికి ఈ శిక్షణా వ్యవహారం ఏదో పది రోజులు నడిచింది. చివర్లో ఓ శాల్తీ అయితే ”సార్‌..మనం ఈ వైద్యంతో పేషంట్లకి తగ్గిపోతుందం టారా?” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ”మన మీద నమ్మకంతో కొంత మందికి తగ్గు తుంది. అదే ప్లాసిబో ఎఫెక్ట్‌. మీరు చేయవలసిందల్లా  వాళ్ళ సమస్యంతా విని ఖచ్చితంగా తగ్గిపోతుం దనే నమ్మకంగా చెప్పాలి. యింకా వాళ్ళని మీరు కొన్ని ప్రశ్నలడగాలి. మీకే పువ్వంటే యిష్టం అని అడగాలి. అప్పుడు  గులాబీ అని చెబితే మీకిచ్చిన డబ్బాల్లో ఉన్న గులాబీ రంగు ప్లాసిబోలు యిచ్చి వేసుకోమనాలి. అలాగే ఏ అంకె యిష్ట మంటే  నాలుగంటే వాటిలో చదరంగా ఉన్న ప్లాసిబోలు వేసుకో మనాలి. మొత్తానికి మీ మీద నమ్మకమే ఆ వచ్చే పేషంట్లలో మూడో వంతుమందికి తగ్గిస్తుంది” అన్నాడు. యిక ఆఖరిరోజు సాయంత్రం ఆ బ్యాచ్‌ అందరికీ పరీక్ష పెట్టడం, అందులో పాసయి అంతా ఆ సర్టిఫికెట్లు పొందడం జరిగింది. అయినా అంతా పాసవ్వక చస్తారా.. ఆ పరీక్షలో అడిగిన ప్రశ్నలు మరీ మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందోలాంటివాయె. సర్టిఫికెట్లు  పొందిన వాళ్ళంతా ఎవరిమటుకువాళ్ళు తమ పేరు ముందు వైద్యాచార్య అనీ, పేరు చివర సి.పి.టి. అన్న డిగ్రీ తగిలించేసుకుని బోర్డు పెట్టేసు కుని ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. యిక అందరి వ్యాపారం.. అదే.. ప్రాక్టీసయితే బ్రహ్మాండంగా ఉంది. యిక వాళ్ళకి తగ్గని కేసుల్లో కొన్ని వెంకటేశానికి పంపుతున్నారు. యిక వెంకటేశం డాక్టర్‌గా తన ప్రాక్టీస్‌ తను చేసుకోవడంతోపాటు ఈ ప్రాక్టీస్‌ కూడా ఎక్కువ యింది. మొత్తానికి డాక్టర్‌గా వెంకటేశం పని ఆరు కేసులూ, రెండు ఫీజుల కింద బ్రహ్మాండంగా ఉంది.
——-
తర్వాత వెంకటేశం వాళ్ళకి తనకేదో కొద్దిపాటి అవగాహన ఉన్న వ్యాధుల గురంచీ, శరీరంలో వేర్వేరు అవయవాల పనితీరు గురించీ వివరించాడు. అంతేకాకుండా తాను బయట తయారు చేయించిన రకరకాల షేపుల్లో, రకరకాల రంగుల్లో ఉన్న ప్లాసిబోలని కూడా వేర్వేరు డబ్బాల్లో పోసి యిచ్చాడు. మొత్తానికి ఈ శిక్షణా వ్యవహారం ఏదో పదిరోజులు నడిచింది. చివర్లో ఓ శాల్తీ అయితే ”సార్‌..మనం ఈ వైద్యంతో పేషంట్లకి తగ్గిపోతుందంటారా?” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ”మన మీద నమ్మకంతో కొంతమందికి తగ్గుతుంది. అదే ప్లాసిబో ఎఫెక్ట్‌. మీరు చేయవలసిందల్లా వాళ్ళ సమస్యంతా విని ఖచ్చితంగా తగ్గిపోతుందనే నమ్మకంగా చెప్పాలి. యింకా వాళ్ళని మీరు కొన్ని ప్రశ్నలడగాలి. మీకే పువ్వంటే యిష్టం అని అడగాలి. అప్పుడు గులాబీ అని చెబితే మీకిచ్చిన డబ్బాల్లో ఉన్న గులాబీ రంగు ప్లాసిబోలు యిచ్చి వేసుకోమనాలి. అలాగే ఏ అంకె యిష్టమంటే నాలుగంటే వాటిలో చదరంగా ఉన్న ప్లాసిబోలు వేసుకోమనాలి. మొత్తానికి మీ మీద నమ్మకమే ఆ వచ్చే పేషంట్లలో మూడోవంతు మందికి తగ్గిస్తుంది” అన్నాడు. యిక ఆఖరిరోజు సాయంత్రం ఆ బ్యాచ్‌ అందరికీ పరీక్ష పెట్టడం, అందులో పాసయి అంతా ఆ సర్టిఫికెట్లు పొందడం జరిగింది. అయినా అంతా పాసవ్వక చస్తారా… ఆ పరీక్షలో అడిగిన ప్రశ్నలు మరీ మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందోలాంటివాయె. సర్టిఫికెట్లు పొందిన వాళ్ళంతా ఎవరిమటుకువాళ్ళు తమ పేరు ముందు వైద్యాచార్య అనీ, పేరు చివర  సి.పి.టి. అన్న డిగ్రీ తగిలించేసుకుని బోర్డు పెట్టేసుకుని ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. యిక అందరి వ్యాపారం.. అదే.. ప్రాక్టీసయితే బ్రహ్మాండంగా ఉంది. యిక వాళ్ళకి తగ్గని కేసుల్లో కొన్ని వెంకటేశానికి పంపుతున్నారు. యిక వెంకటేశం డాక్టర్‌గా తన ప్రాక్టీస్‌ తను చేసుకోవడంతోపాటు ఈ ప్రాక్టీస్‌ కూడా ఎక్కువయింది. మొత్తానికి డాక్టర్‌గా వెంకటేశం పని ఆరుకేసులూ, రెండు ఫీజుల కింద బ్రహ్మాండంగా ఉంది.
——-
”గురూగారూ..అదీ నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం సంబరంగా. దాంతో గిరీశం” అయితే జనాలకి ఆ బల్లిగుడ్లు మందులు యిచ్చేసి ప్లాసిబో ఎఫెక్ట్‌ అనబడే నమ్మకం వైద్యం చేసేశావన్నమాట” అన్నాడు. వెంకటేశం కొద్దిగా యిబ్బందిపడి ”అసలీ కలెందుకు వచ్చినట్టు గురూగారూ?” అన్నాడు. ఈలోగా గిరీశం ఓ చుట్టు అంటించుకుని అప్పుడు వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”అల్లోపతి, హోమియో పతి, ఆయుర్వేదం యునాని లాంటి కొన్ని కోర్సులు చదవడం ద్వారా డాక్టర్‌గా వైద్యం చేయవచ్చు. అయితే జనాభాతో పోల్చినప్పుడు ఈ డాక్టర్ల సంఖ్య  సరిపోవడం లేదన్నది వాస్తవం. అలాగే మారుమూల పల్లెల్లో వైద్యం చేయడానికి అక్కడ ప్రాక్టీసు పెట్టడానికి కూడా చాలా మంది డాక్టర్లు ఆసక్తిగా లేరన్నది ఒక వాదం. యిలాంటి పరిస్థితు ల్లోంచి పుట్టుకొచ్చినవే ఆర్‌ఎంపి, బిఎంపి, పిఎంపి లాంటి వ్యవస్థలు. అయితే వాళ్ళు కేవలం హెల్త్‌ వాలంటీర్లగా ఉండి, ప్రాథమిక చికిత్సతో ఆగకుండా పూర్తిస్థాయి వైద్యులుగా వ్యవహరించడమే అసలు సమస్య. అదీగాక వాళ్ళలో కొందరు పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో కమీషన్లు తీసుకుని పేషంట్లని పంపించడం, దాంతో అక్కడ పేషంట్లకి పడే బిల్లుల్లో ఈ కమీషన్లు కలిసిపోయి బిల్లు తడిసి మోపెడవడం జరుగు తుంది. యిదంతా విమర్శలకి దారితీస్తుంది. యిక వీళ్ళలో కొందర యితే తామే సొంతంగా హాస్పిటల్స్‌ పెట్టేసి నిర్వహణ తాము చూస్తూ జీతాలిచ్చి డాక్టర్స్‌ని పెట్టుకుని నడపడం. యిక వైద్యాన్ని పూర్తి వ్యాపా రంగా చూపించే సంఘటన మొన్న యిక్కడే జరిగింది. యిక్కడో హాస్పిటల్‌ వార్షికోత్సవం సందర్భంగా ‘అయిదుగురు సేషంట్లని తీసుకొస్తే ఆర్‌ఎంపిలకు వెయ్యి రూపాయల కమీషన్‌’లాంటి ప్రకటన చేశారు. దాంతో అంతా అల్లరయి, హాస్పిటల్‌ మూతబడి, డాక్టర్‌ బలయిపోవడం జరిగింది. పవిత్రమయిన సేవాతత్వంతో నడవాల్సిన వైద్య వృత్తి యిలా వ్యాపారంగా మారిపోయే పరిస్థితులు ఎంతమాత్రం హర్షణీయం కాదు” అంటూ తేల్చాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here