కరాటే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నగర విద్యార్ధులు 

0
253
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 :  ఇంటర్‌ స్టేట్‌ ఇన్విటేషనల్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ – 2016 పోటీలలో నగరానికి చెందిన 8 మంది విద్యార్ధులు పోటీలలో పాల్గొని గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఈనెల 20వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరం, ఆల్కాట్‌తోటలోని గేదెల నూకరాజు కల్యాణ మంటపంలో పోటీలు నిర్వహించారు. జిల్లా జనరల్‌ సెక్రటరీ పి.జగన్నాధం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో విక్టోరియా డబుల్‌ డ్రాగన్‌ కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఎస్‌.వలి ఆధ్వర్యంలో విద్యార్ధులు పోటీలలో పాల్గొన్నారు. డిఎంహెచ్‌ఎస్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న వడ్డాది ఆకాష్‌కుమార్‌ కుంగ్‌ఫూ స్పారింగ్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. పవర్స్‌ స్కూల్‌కు చెందిన వడ్డాది రామ్‌చరణ్‌తేజ కుంగ్‌ఫూ స్పారింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు. అదే స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న వడ్డాది షాలెమ్‌రాజు కరాటే అండ్‌ కుంగ్‌ఫూ స్పారింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అదే స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న బుద్ధాల వర్షిత్‌ కుంగ్‌ఫూ కటాస్‌ స్పారింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. శ్రీ గౌతమి పబ్లిక్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న ఎం.డి.పర్వేజ్‌ పాషప్‌ కుంగ్‌ ఫూ కటాస్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. అలాగే శోభ పబ్లిక్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న బంగారు మణికంఠ కుంగ్‌ఫూ కటాస్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. ఎస్‌కెవిటి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న జంపల గిరిచరణ్‌ కుంగ్‌ఫూ స్పారింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆర్గనైజర్‌ పి.జగన్నాధం చేతులమీదుగా మెడల్స్‌ అందుకున్నారు. గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన విద్యార్ధులకు మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదిరెడ్డి వాసు, విక్టోరియా డబుల్‌ డ్రాగన్‌ కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ సంస్థ అధ్యక్షులు రెడ్డి రాజు తదితరులు అభినందనలు తెలిపారు.