కరుటూరిని కలిసిన సన్‌రైజర్స్‌ రైడర్స్‌ 

0
395
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 10 : కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుండి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్ర చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ కరుటూరి నరసింహారావును ఏలూరులో సన్‌రైజర్స్‌ రైడర్స్‌ అడ్మిన్‌ విక్రమ్‌ సందీప్‌ చౌదరి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌ మద్దు సతీష్‌, 22వ డివిజన్‌ తెదేపా కోశాధికారి కేదారిశెట్టి గోవింద్‌ కలిశారు. ఒక మంచి సంకల్పంతో కరుటూరి నరసింహారావు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. ఆయనతోపాటు రెండు కిలోమీటర్ల దూరం నడిచారు. వారితోపాటు ఆలయ ధర్మకర్తలు నాగేశ్వరరావు, తదితరులు పాదయాత్రలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here