కర్రి రాజా స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం 

0
219
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్రీడా స్థలంలో కర్రి రాజా మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ప్రారంభించారు. సేవా దృక్ఫదంతో, స్నేహితుల పట్ల అభిమానంతో మెలిగి, ఆకస్మికంగా మృతి చెందిన కర్రి రాజా జ్ఞాపకార్ధం ప్రతి ఏటా అభిమానులు క్రీడా రంగాన్ని ప్రొత్సహించే విధంగా ఈ తరహా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని శివాజీ అన్నారు. 12 టీమ్‌లు పోటీలో పాల్గొన్నాయి. 12 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. చారి ఛాలెంజర్స్‌ వెర్సర్స్‌ ఆర్‌ఆర్‌ వారియర్స్‌ మధ్య ప్రారంభ పోటీ జరిగింది. విన్నర్‌కు రూ. 25వేలు, రన్నర్‌కు రూ.12,500 అందజేస్తారు. టోర్నమెంట్‌ నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు, కోఆప్షన్‌ సభ్యులు కప్పల వెలుగు కుమారి, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బొచ్చా రమణ, రాష్ట్ర నాయకులు, రామకృష్ణ, నాయకులు విజ్జన మధు, తుమ్మల తాతారావు, తిరగటి శివ, రాజారావు, తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్స్‌గా శేఖర్‌బాబు, కోట, వెంకటేష్‌, చారి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here