కలాం పేరుతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం

0
167
విద్యార్ధులకు పురస్కారాల వేడుకలో వక్తలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 15 : భారతీయ మిస్సెల్‌ మ్యాన్‌గా పేరొందిన, మాజీ రాష్ట్రపతి, భారతరత్న  ఎపిజె అబ్దుల్‌ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. కలాం వెల్ఫేర్‌ అసియేషన్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ వ్యవస్ధాపకులు ఎండి ఆరిఫ్‌ అధ్యక్షతన మంగళవారం స్ధానిక సంహిత కళాశాలలో 300 మంది విద్యార్ధులకు కలాం పురస్కారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ విద్యలో రాణిస్తున్న వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసిపి సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసిపి నగర కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, సిసిసి ఎండి పంతం కొండలరావు, నగరపాలక సంస్ధ మాజీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలరెడ్డి, న్యాయవాది బి పద్మావతి, ముస్లిం నాయకులు, కవి ఖాదర్‌ఖాన్‌, షేక్‌ సుభాన్‌, హెల్పింగ్‌ హేండ్స్‌ నిర్వాహకులు అనూప్‌ జైన్‌, సంహిత కళాశాల ప్రిన్సిపాల్‌ బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం ద్వారా వారి నుండి స్ఫూర్తిని పొందుతామన్నారు. కావునా ఉన్నతమైన వ్యక్తుల జీవితాలను విద్యార్ధులు చదవాలన్నారు. నగరంలో కలాం విగ్రహం ఏర్పాటుతో పాటుగా, ఆయన పేరును ఏదైనా భవనానికి పెట్టాలని శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం చేసిన సూచిన స్వాగతించదగినదన్నారు. నగరంలో ఏదైనా పార్కుకు కలాం పేరుపెట్టి, దాన్ని దత్తతు తీసుకుని విద్యార్ధులకు, యువతకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా కలాం జీవిత ఘట్టాలను, విజయాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఆరిఫ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ విద్యలో రాణిస్తున్న వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 300 మందికి ఈ పురస్కారాలు అందిస్తున్నామని, వచ్చే ఏడాది జిల్లా వ్యాప్తంగా 500 మంది విద్యార్ధులను గుర్తించి పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసదుల్లా అహ్మద్‌, విక్రంజైన్‌, షయ్యద్‌ హసీనా, హాసన్‌, అల్లు శేషునారాయణరావు, బషీర్‌, ఆరీఫ్‌, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here