కాంగ్రెతోనే ప్రత్యేక హొదా సాధ్యం

0
236
ఇంటింటికి కాంగ్రెస్‌లో ఎన్‌వి శ్రీనివాస్‌
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌ అన్నారు. దేశానికి రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదా ఇవ్వడంతో పాటు విభజన చట్టంలోని అన్ని హామీలను నేరవేర్చుతానని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందన్నారు. స్థానిక దానవాయిపేట ఎస్‌కెవిటి కళాశాల వద్ద నుంచి ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేసారు. ఎన్‌వి మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ శ్రేణులకు నూతనోత్తేజం వచ్చిందన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌ఎకె అర్షద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఎ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా ప్రజలను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుందో అందరికి తెలిసిందేనన్నారు. ప్రజలపై భారం మోపుతున్న ఆ పార్టీకి బుద్ధిచెప్పి కాంగ్రెస్‌కు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నలబాటి శ్యామ్‌, వెలిగట్ల పాండురంగారావు, పిల్లా సుబ్బారెడ్డి, లోడ అప్పారావు, అబ్ధుల్లా షరీఫ్‌, బేరి మోహిత్‌, దాసరి శివరామప్రసాద్‌, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here