కాంగ్రెస్‌తోనే ఏపీకి హోదా ఇంటింటికి అభయ హస్తం కరపత్రాల పంపిణీ  

0
168

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22 : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్‌వి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఎంహెచ్‌ స్కూల్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అభయ హస్తం పేరుతో ముద్రించిన కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎన్‌వి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే సాధ్యమని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ కేంద్రంలో అధికారాన్ని పెట్టిన వెంటనే మొదటి ఫైల్‌గా ప్రత్యేక ¬దాకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎపి కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు చేపట్టిన భరోసా యాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గోలి రవి, కాటం రవి, పిసపాటి రవీంద్రశ్రీనివాస్‌, లోడా అప్పారావు, బేరీ మోహత్‌, పట్టాబి, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here