కాంగ్రెస్‌తోనే దేశ భవిష్యత్తు 

0
123
ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతలు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28: అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగాయి. ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్థానిక జాంపేటలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. అధికారంలోకి బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థన్నీ ఖునీ చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ వాదులపై ఉందన్నారు. యువనేత రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సంపాదించుకోవడం ఖాయమన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేస్తూ దేశానికి నష్టం చేకూరుస్తుందన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకుని దేశంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు.కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు యుపిఎ మాజీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తిరిగి ప్రజల ముందుకు వచ్చేందుకు అవసరమైన కృషి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సి, క్యాబ్‌, ఎన్‌పిఆర్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు చేటు తెచ్చేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెప్పాలని కోరారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సోనియా, రాహుల్‌ నాయకత్వం వర్థిల్లాలని, జై కాంగ్రెస్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు.అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెజవాడ రంగారావు, అబ్ధుల్లా షరీష్‌, కొణతం సుబ్బారావు, గోలి రవి, పిల్లా సుబ్బారెడ్డి, కాటం రవి, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌, దాసరి ప్రసాద్‌, కొవ్వూరి శ్రీనివాసరావు, పట్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here