కాంగ్రెస్‌  పట్ల  ప్రజల్లో సానుకూల స్పందన 

0
184
ఈ పర్యాయం మంచి ఫలితాలు సాధిస్తాం : పళ్ళంరాజు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 :  గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో  కాంగ్రెస్‌ పట్ల ఈ ఎన్నికల్లో సానుకూల స్పందన లభిస్తోందని, రాహుల్‌ ప్రధాని అయితే బాగుంటుందని చాలామంది చెబుతున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పల్లంరాజు చెప్పారు. సిటీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికల కార్యాలయంలో ఈ ఉదయం డిసిసి ప్రెసిడెంట్‌ ఎస్‌ ఎన్‌ రాజా, ఎంపీ అభ్యర్థి ఎన్వీ శ్రీనివాస్‌, సిటీ అభ్యర్థి  బోడా వెంకట్‌లతో కల్సి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువత ఎక్కువగా కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారని, కొన్ని చోట్ల అభ్యర్థులు రేసులో గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చూస్తుంటే ప్రధానమైన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు బురద జల్లుకునే విధానం చూస్తుంటే, చాలా బాధ కలుగుతోందన్నారు. అధికార టీడీపీ అవినీతిని ప్రజలు భరించలేక పోతున్నారని, అలాగే వైసీపీ వస్తే ఏమైపోతుందోనన్న భయం ప్రజల్ని  వెంటాడుతోందని ఆయన విశ్లేషించారు. అందుకే కాంగ్రెస్‌  అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు మంచి స్పందన
రాహుల్‌ గాంధీ నాయకత్వంలో రూపొందిన కాంగ్రెస్‌ మేనిఫెస్టోకి మంచి స్పందన లభిస్తోందని ముఖ్యంగా ‘న్యాయ’ పధకం ద్వారా నెలకు 6వేలు చొప్పున ఏడాదికి 72 వేలు పేదల కుటుంబాలకు అందించాలన్న విధానానికి ప్రజలను మంచి స్పందన వస్తోందని పల్లంరాజు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.  న్యాయ వ్యవస్థలో సైతం జోక్యం పెరిగిపోయిందన్న విమర్శలు వస్తున్నాయని, ఇక ప్రణాళిక సంఘం ఎత్తేసి నీతి ఆయోగ్‌ పేరిట ఏర్పాటుచేసిన సంస్థ స్వతంత్రత లేకుండా ప్రధాని మౌత్‌ పీస్‌లా మారిందని ఆయన ఆవేదన చెందారు. సిబిఐలో గొడవలు ఇక చెప్పక్కర్లేదన్నారు. ఆర్‌బిఐకి సంభందం లేకుండా తీసుకున్న నోట్ల రద్దు వ్యవహారంతో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. తీసుకున్న ఈ నిర్ణయం  మళ్ళీ మోడీ వస్తే రాజ్యాంగం మార్చేస్తారన్న అనుమానం అందరిలో ఉందన్నారు. అబ్దుల్లా షరీఫ్‌,కిషోర్‌ కుమార్‌ జైన్‌,గోలి రవి, బెజవాడ రంగారావు,నలబాటి శ్యాం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here