కాతేరుకి తాగునీరు అందించాలని బిజెపి దీక్ష 

0
281
రాజమహేంద్రవరం, జూలై 16 : చెంతనే  గోదావరి ఉన్నా సరే, కాతేరులో  తాగునీటి కోసం ప్రజలు నానా  ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ,  తక్షణం కుళాయిల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేయాలని బిజెపి  డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రూరల్‌ మండల బిజెపి అధ్యక్షులు యానపు యేసు ఆధ్వర్యాన  సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట  తాగునీటి  సమస్య పరిష్కారం కోసం జాగృతి యాత్ర లో భాగంగా నేడు ఒకరోజు దీక్ష చేపట్టారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధార్వాడ రామక ష్ణ హాజరయ్యారు. జిల్లా యువమోర్చ అధ్యక్షులు ఆకుల శ్రీధర్‌, అసెంబ్లీ కన్వీనర్‌ ఒంటెద్దు స్వామి, పన్నాల వెంకట లక్ష్మి, కొటికలపూడి వెంకటేశ్వర రావు,  రొంగలి గోపి, ఆకుల నర్సవేణి, కొల్లి అనిల్‌, పిల్లి శ్రీను, పితాని దేవి, పిచ్చుక రాంబాబు, బండారు అప్పారావు, మన్నెం శ్రీను, ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రామాల వికాసం కోసం పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నందున ఆ  పథకంలో తక్షణం కాతేరుకు కుళాయిల ద్వారా తాగునీరు అందించాలని కోరారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here