కాతేరు గ్రామంలో గోరంట్ల  పాదయాత్ర 

0
156
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కాతేరు గ్రామంలో రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు పాదయాత్ర చేశారు. గ్రామంలోని శాంతి నగర్‌, గణపతి నగర్‌, మిలటరీ కాలనీ, సుబ్బారావు పేటలలో ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా ఏఒక్క గడపకి వెళ్లిన మా రేషన్‌ కారు, పింఛన్లను రద్దు చేశారని ప్రజలు చెబుతున్నారని, ఎన్నో హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈరోజున ప్రజలపై కక్ష తీర్చుకునేలా పాలన సాగిస్తుందన్నారు. దీనిలోభాగమే అర్హులైన వారికి సంబంధించిన పింఛన్లను కూడా రద్దు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు సాగే పరిస్థితి కన్పించడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, బిక్కిన సాంబ, గంగిన తిరుమలరావు, ఎలిపే జాన్‌, విజయ్‌, నాగేశ్వరరావు, బలగం కిరణ్‌, ప్రకాష్‌, రూపేష్‌, మోతా పాపాయమ్మ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here