కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా

0
260
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, జులై 29 : ఆంధ్రప్రదేశ్‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజా నియామకంపై గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు రాగా ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహనరావు తనయుడైన రాజా కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌ వెన్నంటి ఉన్నారు. జక్కంపూడి కుటుంబం యావత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారు. రాజా ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి హయాం నుంచి జక్కంపూడి కుటుంబం తనకు అండగా ఉండటంతో సీఎం జగన్‌ ఆ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు, పార్టీ నేతలు  హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి క తజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here