కాపు రుణాల చెక్కుల పంపిణీ

0
242

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24 : కాపు కార్పొరేషన్‌ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు డిసిసిబి బ్యాంక్‌ ద్వారా 21 మంది కాపు రుణాల చెక్కులను కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు అందజేశారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కారక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి ఆర్థిక చేయూతను ప్రభుత్వపరంగా అందించిన ఘనత సీఎం చంద్రబాబునాయుడికే దక్కుతుందని, భవిష్యత్తులో కాపు బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చడం ఖాయమన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందిన ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్ధిరపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ గాదిరెడ్డి పెదబాబు, 25వ డివిజన్‌ టిడిపి అధ్యక్షులు గుణపర్తి శివ, పిన్నింటి రవిశంకర్‌, కాపు నాయకులు పడాల శ్రీనివాస్‌, హరి బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here