కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం  

0
151
రాజమహేంద్రవరం,జనవరి 3 : త్వరలో జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో శివరామ సుబ్రహ్మణ్యం నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సిపి పోటీచేసి గెలిచి పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.  స్థానిక జమిందార్‌మెట్టపై ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నగర కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్‌, బొంతా శ్రీహరి, నండూరి రమణ, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు మాట్లాడారు. టీడీపీ నాయకులు తమను విమర్శించడానికి శివరామ సుబ్రహ్మణ్యం స్థాయి సరిపోదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు ఎపిఐఐసి చైర్మన్‌గా, ప్రస్తుతం వైసిపి సిటీ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శివరాముడి స్థాయి వారికే లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, రైతు భరోసా ఇలా రోజుకో కార్యక్రమాన్ని అమలు చేస్తుండటంతో టీడీపీ నాయకులు బేజారెత్తిపోతున్నారనానరు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల సంక్షేమంతో పాటు తాజాగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి జగన్‌ మగాడిగా నిరూపించుకున్నారన్నారు. అమరావతి రాజధానిగా ఉండదని సిఎం జగన్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారన్నారు.  వైఎస్‌ఆర్‌సిపి నగరంలో చాలా పటిష్టంగా ఉందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి కార్పొరేషన్‌లో విజయం ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు అందరికీ ఉందని, అయితే వ్యక్తిగత దూషనలు చేయడం మాత్రం భావ్యం కాదని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు సుంకర శ్రీను, మార్తి నాగేశ్వరరావు, పెదిరెడ్ల శ్రీనివాస్‌, కాటం రజనీకాంత్‌, తిరగటి దుర్గ, సయ్యద్‌రబ్బానీ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here