కార్మికులకు అండగా నిలిచింది టీడీపీయే

0
71
రాజమహేంద్రవరం, జనవరి 4 : కార్మికులకు అండగా నిలిచి వారికి కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వమేననీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక టి ఎన్‌ టి యు సి కార్యాలయంలో జరిగిన ది రాజమండ్రి పేపర్స్‌ అండ్‌ మూవర్స్‌ అసోసియేషన్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు కార్మికుల వెంటే ఉంటుంది అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేసి రాష్ట్రంలో సుమారు మూడు కోట్ల మందికి లబ్ధి చేకూర్చిందన్నారు. టి ఎన్‌ టి యు సి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకాన్ని ఎత్తివేసి కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షులు పీవీ సర్వేశ్వర రావు, ప్రభుదాసు, రాము, దేవా, సుబ్రహ్మణ్యం, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here