కార్మికులకు తక్షణ న్యాయం చేయాలి 

0
126
వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు అడపా
రాజమహేంద్రవరం,మార్చి 6 :  కార్మికులు మానసిక క్షోభకు గురి కాకుండా వారికి కార్మిక శాఖ అధికారులు తక్షణ న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమకు యాజమాన్యం నుంచి ఫలానా సమస్య వచ్చింది పరిష్కరించండి అంటూ కార్మికులు వెళ్లి జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ వద్ద మొరపెట్టుకుంటే ఐదారు నెలలకు కానీ పరిష్కారం దొరకడం లేదని, ఇంత సమయం వృధాగా పోయిన తరువాత లేబర్‌ కోర్టులో చూసుకోవాలంటూ సదరు అధికారులు సమాధానం చెబుతున్నారని తెలిపారు. ఈ ఐదారు నెలలు పాటు కార్మికులు అప్పులు చేసి వారి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి, లేబర్‌ ఆఫీసర్‌ కార్మికుల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తే కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. అయితే కార్మికుల సమస్యను ఆసరాగా చేసుకుని కొంతమంది… కార్మికులు, యాజమాన్యానికి మధ్య ఉన్న వివాదాన్ని మరింత పెంచి పబ్బం గడుపుకుంటున్నారు. చివరికి యాజమాన్యానికే న్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించి ఎవరి వైపు మొగ్గు చూపకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.  కార్మికులకు న్యాయం జరిగేలా అధికారులు చూస్తేనే వారిపై కార్మికులకు గౌరవం పెరిగి, ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా వారి దగ్గరకు వస్తారన్నారు.  మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తే కార్మికుల సమస్యకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here