కార్యకర్తల సంక్షేమానికి తెదేపా పెద్ద పీట

0
198
సభ్యత్వ నమోదు ప్రారంభంలో గుడా చైర్మన్‌ గన్ని
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : అందరి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని, కార్యకర్తలు తలెత్తుకు తిరిగేలా సిఎం చంద్రబాబు పరిపాలిస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ అన్నారు. స్థానిక 24,32,13 డివిజన్లలో కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌ కుమార్‌, ద్వారా పార్వతి సుందరి, పాలిక శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని అన్నారు. సభ్యత్వ నమోదు చేయించున్న ప్రతి ఒక్కరూ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉంటారని, పార్టీకి కార్యకర్తలే కొండంత బలమన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ దొండపాటి శేఖర్‌ బాబు, బెజవాడ వెంకటస్వామి, కర్రి కాశి విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here