కుట్రలు,కుయుక్తుల్ని తిప్పిగొట్టి చంద్రబాబుకు అండగా నిలవాలి

0
204
43 వ డివిజన్‌ నగర దర్శినిలో గన్ని కృష్ణ, ఆదిరెడ్డి పిలుపు
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 20 : ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి, మరోవైపు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ విభజన చట్టంలో అంశాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన సీఎం చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించి ఐదు కోట్ల ఆంధ్రులు అండగా నిలవాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 43వ డివిజన్‌లో తెదేపా నగరదర్శిని కార్యక్రమాన్ని కార్పొరేటర్‌ కంటిపూడి పద్మావతి ఆధ్వర్యాన నిర్వహించారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌. విగ్రహానికి గన్ని, ఆదిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేణులను ప్రజలతో మరింత మమేకం కావాలని నిర్ణయించి నగరదర్శిని కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్నకృషిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవికి ఆ పార్టీలో సమర్ధులైన నాయకుడు లేడన్న భావనతో పక్క పార్టీ నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వారికి దాపురించిందన్నారు. రాష్ట్రానికి చేకూర్చవలసిన ప్రయోజనాలను, సాధించాల్సిన నాయకులు చంద్రబాబుపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని, అప్పుడే కేసులు లేవని చెప్పిన పోలీసులు ఎలాంటి సమన్లు ఇవ్వకుండా నాన్‌ బెయిల్‌ బుల్‌ వారెంట్లు మంజూరు చేయడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టును కూల్చి వేయడానికి చంద్రబాబు మారణాయుధాలతో వచ్చారని లేనిపోని ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ఈనెల 23న ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకే మోడి, అమిత్‌ షాలు కుట్ర చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు.చంద్రబాబుపై బొంబాయి హైకోర్టులో కేసు వేస్తామని   బిజెపి నాయకుడు జివిఎల్‌ చెప్పడం వెనుక వారి ఓర్వలేని తనం అర్థమవుతుందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను తగ్గించలేరని, ప్రజలే ఆయనకు అండ అని అన్నారు. రానున్న ఎన్నికలలో బిజెపి నాయకులకు బుద్ది చెప్పేలా ప్రజలు సిద్దం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్‌ కడలి రామ కృష్ణ, కంటిపూడి శ్రీనివాస్‌, కొండేటి సుధాకర్‌, కడితి జోగారావు, జాలా మదన్‌, కాకర ప్రసాద్‌, పుట్టా సాయిబాబు, డివిజన్‌ అధ్యక్షులు గండేబత్తుల రామ కృష్ణ, కార్యదర్శి శేఖర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు తాతబ్బాయ్‌, సాంబశివరావు  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here