ఆర్పిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
రాజమహేంద్రవరం,సెప్టెంబర్ 20 : కులరహిత సమాజంగా వుండాలని, సమాజంలో కుల,మతాలకు అతీతంగా అందరూ జీవించాలని కోరుతూ రాజమండ్రి ప్రొటెస్టింగ్ స్టూడెంట్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఎవి అప్పారావురోడ్డు రామాలయం సెంటర్లో బిసిి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంఘటనను నిరసిస్తూ హత్యలు సమస్యకు పరిష్కారం కావని వారు తెలిపారు. ఇటువంటి వివాదాల్లో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. కుల,మతాలకు అతీతంగా అందరూ జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎస్ఎఫ్ సభ్యులు రామ్, నితిన్కట్టమేను, బషీర్, నీలాపు సతీష్, బాబినాయుడు, సత్య, మనీశ్మార్ట్, కాదా రాజేష్, సూర్య, వెంకటేష్, పవన్నాయుడు, ప్రజా సంఘాల నాయకులు పొనమాల వెంకటరవికుమార్, రవి రాయల్, సుభాని, సిసిసి ఛానల్ యాంకర్ వి.జె.సుకుమార్లు పాల్గొన్నారు.