కులాల పేరిట ఉన్న సూచిక బోర్డులను తొలగించాలి

0
52
అధికారులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కారెం శివాజీ ఆదేశం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9: దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 7 దశాబ్దాలు అవుతున్నా ఇంకా అంటరానితనం కొనసాగుతుందని, ఇప్పటికి అనేక గ్రామాలు, పట్టణాలలో కులాల పేరిట సూచిక బోర్డులు ఉండటం సిగ్గుచేటని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిధి గ హంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ చైర్మన్‌ గా రాష్ట్రంలోని13 జిల్లాలో పర్యటించి అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపానన్నారు. అయితే సామాజిక భవనాలయ, నివాస సముదాయాలు, వీధి మార్గాలు, పేటలకు హరిజన పేట, గిరిజన పేట, పెద మాలపల్లి, చినమాలపల్లి అంటూ బోర్డులు ఉండటం సరికాదన్నారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, తక్షణమే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ కాలనీగా గానీ, దేశ నాయకుల పేర్లను గానీ పెట్టాలని సూచించారు. ఇంకా కులాల పేరుతో సూచిక బోర్డులు ఉండటం రాజ్యాంగ విరుధ్దమన్నారు. అదే విధంగా కుల ధ్రువీకరణ పత్రాలలో కూడా హరిజన, గిరిజన అనే పదాలు రాకుండా అధికారులు చూడాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు 14 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను కేటాయించదని, దానిలో 9 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కాగా మిగిలిన 5 లక్షల ఎకరాలలో తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్‌కి 3 లక్షల ఎకరాల భూములను కేటాయించిందన్నారు.ఆంధ్రాకు కేటాయించిన 3 లక్షల ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ కొర్రీల వలన అది ఎస్సీ, ఎస్టీలు అనుభవించకుండా అన్యాక్రాంతమవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ భూములను ఎస్సీ, ఎస్టీలకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వం అంటరానితనంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి చైర్మన్‌ శివాజీ వరకు వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బొచ్చా రమణ, తుమ్మల తాతారావు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబురాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here