కేంద్రాన్ని నిలదీసే దమ్ము..ధైర్యం ఉన్నాయా? 

0
377
జగన్‌, పవన్‌లకు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ సూటిప్రశ్న
50 వ డివిజన్‌లో ఉత్సాహంగా తెదేపా నగర దర్శిని
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 22:  రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గానీ, తిత్లీ తుఫాను నష్టపరిహారం గురించి గానీ కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌, పవన్‌లకు ఉందా అని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ప్రశ్నించారు. స్థానిక 50 డివిజన్‌లో పార్టీ డివిజన్‌ ఇన్చార్జ్‌ మరుకుర్తి రవియాదవ్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగరదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌.విగ్రహానికి గన్ని కృష్ణ , ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాల రాయుడు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్‌ చల్లా శంకర్రావు, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ 2014 ఎన్నికల తరువాత సంభవించిన హుద్‌ హుద్‌ తుఫాను ధాటికి విశాఖపట్నం అతలాకుతలం అయ్యిందని, అలాంటి పరిస్థితులలో యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దిన కార్యదక్షులు చంద్రబాబు అని కొనియాడారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తిత్లీ తుఫానుకు ముందు రోజే రాత్రి ఒంటిగంట వరకు అధికారులను అప్రమత్తం చేసి తుఫాను సంభవించిన వెనువెంటనే అక్కడకు చేరుకుని మండలానికి ఒక మంత్రిని, ఒక ఐఎఎస్‌ అధికారిని నియమించి పరిస్థితులు చక్కదిద్దే వరకు ఆయన అక్కడే ఉండి ప్రజల బాగోగులు చూసారని, అంత కష్టపడిన చంద్రబాబుని పనికిమాలిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ పక్క జిల్లాలోనే ఉండి సహాయం చేయకపోగా కష్టపడుతున్న సిఎం పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. మరోవైపు పదివేల మంది పట్టే స్థలంలో పది లక్షల మందితో కవాతు నిర్వహించామని చెప్పుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌ సాయం చేయకపోగా నోరు పారేసుకోవడం సబబుకాదన్నారు. విభజన హామీలు నెరవేర్చని కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేని జగన్‌, పవన్‌ లు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.తిత్లీ తుఫాను తరువాత గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ శ్రీకాకుళం రాకుండా వెనుదిరగడం దారుణమన్నారు. ప్రతిపక్ష నాయకుల అవాస్తవాలను నమ్మి రానున్న ఎన్నికలలో ఈ రాష్ట్రాన్ని వారి చేతిలో పెడితే కుక్కలు చింపిన విస్తరిలా మారడం ఖాయమన్నారు.ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యమన్నారు.ఆర్థిక లోటు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చారని, రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయనను మళ్ళీ గెలిపించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ మంతెన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నగరదర్శిని కార్యక్రమం వేగవంతంగా, ఉత్సాహంగా జరుగుతుందని, నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాలను పరిష్కరించాలన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించాలని అన్నారు.మేయర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న చంద్రబాబు క షిని అందరూ గుర్తించాలని కోరారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ నాయకుడికి లేని కార్యదక్షత, ఆలోచన విధానం చంద్రబాబు ఒక్కరికే ఉందని, అలాంటి నాయకుడు ప్రస్తుత పరిస్థితులలో సిఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. కాశి నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులుగా ఉన్న జగన్‌, పవన్‌ లకు ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరుకుర్తి రవి యాదవ్‌ స్థానికంగా ఉన్న పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం లాలాచెరువు సమీపంలో ఉన్న కంపోస్ట్‌ యార్డును నాయకులు పరిశీలించారు. కంపోస్ట్‌ యార్డుకు చెత్తను తరలించే సమయంలో రోడ్లపై పడిపోకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా కంపోస్ట్‌ యార్డును వేమగిరి వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గన్ని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, కడలి రామకృష్ణ , పార్టీ నాయకులు పెనుగొండ రామకృష్ణ , కరగాని వేణు, మాజీ కార్పొరేటర్‌ బూర రమేష్‌ ప్రసాద్‌, ఆశపు సత్యనారాయణ, కవులూరి వెంకట్రావు, పితాని కుటుంబరావు, మెహబూబ్‌ ఖాన్‌, మిస్కా జోగినాయుడు, చింతపల్లి నాని,జాగు వెంకటరమణ, జాలా మదన్‌, పుట్టా సాయిబాబా, దమర్‌ సింగ్‌ బ్రహ్మాజీ తదితరులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here