కొత్తల సోదరులకు గోరంట్ల, గన్ని పరామర్శ

0
116
రాజమహేంద్రవరం, ఆగస్టు 21 : తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్‌ కొత్తల దొరబాబు, కాంట్రాక్టర్‌ కొత్తల సత్యనారాయణ సోదరుల మాతృమూర్తి గంగారత్నం ఇటీవల పరమ పదించారు. ఈ విషయం తెలిసి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ  ఈరోజు స్ధానిక మోడల్‌ కాలనీలోని సత్యనారాయణ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. దొరబాబు, సత్యనారాయణ సోదరులకు తమ సానుభూతి తెలిపారు. వారి వెంట నగర తెదేపా ప్రధాన కార్యదర్శి రెడ్డి మణీశ్వరరావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here