కొత్త పుంతలు తొక్కుతున్న సేద్యం

0
186
ఖరీఫ్‌ కార్యాచరణపై సెమినార్‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్‌
రాజమహేంద్రవరం, మే 13 : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెలా జీతం వస్తున్నట్టే రైతులకు కూడా ఏడాదంతా ఆదాయం వచ్చే వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌ అన్నారు. మోరంపూడిలోని ఫంక్షన్‌ హాల్‌లో వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సీజన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణ పద్ధతులు, ప్రభుత్వ విధానంపై ఆ శాఖలో కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారులతో ఒక రోజు సెమినార్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ సదస్సును రాజశేఖర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించగా, స్పెషల్‌ కమిషనర్‌ మురళీధర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విజయకుమార్‌, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు 12 జిల్లాల్లో సదస్సులు పూర్తయ్యాయని, ఈ జిల్లాతో సదస్సులు పూర్తిచేసి ఖరీఫ్‌కు రైతులను సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతపురంలో గత ఏడాది వర్షం లేకుండా వేరుశెనగ పంట పండించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, ఈ ఏడాది ఆ పద్ధతిని అన్ని జిల్లాల్లో అనుసరించాలని కృషి చేస్తున్నట్టు వివరించారు. ఒక ఎకరంలో చేపట్టిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే వర్షాలు, వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా విప్లవాత్మకమైన విధానం అమల్లోకి తెస్తున్నామన్నారు. ఏడాదంతా పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో మందుకు సాగుతున్నామని 10 నుంచి 20 లక్షల రైతులకు ఏడాదంతా ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరంలో ఈ విధానం అమల్లోకి తెచ్చామని ఇప్పుడు నాలుగింతలు పెరిగిందన్నారు.  సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంపై రాసిన పుస్తకాలను చదివేందుకు చాలా మందికి సమయం ఉండటం లేదన్నారు. ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోందని, ఈ ఏడాది ఒక మిలియన్‌ ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయడానికి రైతులను సిద్ధం చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 5 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించే అంశంపై కూడా చర్చలు చేస్తున్నట్టు వివరించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన  మద్ధతు ధరకే ధాన్యం అమ్మకాలు చేసుకోవాలని సూచించామని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తెస్తే పౌరసరఫరాల శాఖ కమీషనర్‌కు లేఖ రాసత్మన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధరలు కంటే తక్కువకు ధాన్యాన్ని అమ్మవద్దని రైతులకు సూచించారు. ఇంకా సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సాయిలక్ష్మీ, ఈశ్వరి, ఎన్‌.పద్మావతి, కెఎస్‌వి ప్రసాద్‌, హరిబాబు, పిబిఎన్‌ నాగాచారి, ఎన్‌డిఆర్‌కె శర్మ, నారాయణ చౌదరి, జయకుమార్‌, ఎన్‌సిహెచ్‌ బాబూనాయక్‌, అశ్వినికుమార్‌, సుధాకర్‌రాజు, ఎం.సంజీవ్‌బాబు, రామ్మోహన్‌, టి.ప్రవీణ్‌, సి.వెంకటరెడ్డి, కె.పార్ధసారధి, అన్ని డివిజన్ల ఎడిలు, ఎఓలు, ఎంపిఇవోలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here