కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం

0
195
శివరామ సుబ్రహ్మణ్యం దంపతుల భూమి పూజ
రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 5 : విస్తరిస్తున్న రాజమహేంద్రవరం వంటి నగరంలో స్థానిక ప్రజల అవసరాలను తీర్చేలా కమ్యూనిటీ హాళ్లను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌, ఎపిఐఐసి మాజీ ఛైర్మన్‌ శ్రీఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. నగరపాలకసంస్థ రెండో డివిజన్‌ నారాయణపురంలో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (గుడా) నిధులతో నిర్మించే  కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు ఈరోజు భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, వైసిపి కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర వైసిపి అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను తీర్చేలా జి ప్లస్‌ 2 పద్ధతిలో ఈ కమ్యూనిటీ హాల్‌కు కోటి రూపాయలతో నిర్మాణం చేస్తారన్నారు. గుడా తొలి విడతగా రూ.50 లక్షలు విడుదల చేసిందని, మిగిలిన 50 లక్షలను మలివిడతగా మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తయితే స్థానికులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధర్‌, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, పొలసానపల్లి హనుమంతరావు, బొంతా శ్రీహరి, వాసంశెట్టి గంగాధర్‌, నక్కెళ్ల బాబూరావు, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, రాయుడు గణేష్‌, మేరపురెడ్డి రామకృష్ణ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here