కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు : గన్ని 

0
122
రాజమహేంద్రవరం, ఆగస్టు 22 : పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఆదేశాలు జారీచేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, అపరిపక్వ, కక్షపూరిత నిర్ణయాలకు చెంపపెట్టు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. అదే విధంగా పీపీఏల రద్దుపై వెనకంజ వేయడం తన నిర్ణయాలు తప్పుల తడకలని ప్రభుత్వం ఆలస్యంగానైనా గమనించడం గమనార్హమన్నారు. రాజధాని అమరావతి విషయంలో కూడా ఊగిసలాట ధోరణి మానుకుని ప్రజాభీష్టం మేరకు అమరావతి అభివృధ్ది చేయడంపై దృష్టి సారించవలసిందిగా డిమాండ్‌ చేశారు. కేవలం చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలతో మాత్రమే కాలాన్ని వృధా చేయకుండా ఇకనైనా తాను ఎన్నో ఆశలు కలిపించి హామీలనిచ్చి ఒక్క చాన్సిచ్చిన ప్రజలకు న్యాయం చేసి ‘మంచి ముఖ్యమంత్రి’ అనిపించుకోవాలన్న కలను నెరవేర్చుకోవలసిందిగా జగన్‌కు ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here